Prasanth Varma: ప్రశాంత్ వర్మ పై సీరియస్‌ అయిన బాలయ్య.. చిన్న కట్ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్?

by Prasanna |
Prasanth Varma: ప్రశాంత్ వర్మ పై సీరియస్‌ అయిన బాలయ్య.. చిన్న కట్ కోసం భారీ రెమ్యునరేషన్ డిమాండ్?
X

దిశ, వెబ్ డెస్క్ : సినీ ఇండస్ట్రీలో సక్సెస్, ఫెయిల్యూర్ రెండూ ఉంటాయి. వీటిని బ్యాలెన్స్ చేసుకున్న వారు ఎక్కువ కాలం సినిమాల్లో ఉంటారు. ఒక్క మూవీ హిట్ అవ్వగానే కొందరికి ఎక్కడ లేని ఊపు వచ్చేస్తుంటుంది ఇక ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తుంటారు. ఇలా చేసిన వారిలో కొందరు కనుమరుగయిపోయిన హీరో, హీరోయిన్లు చాలా మంది ఉన్నారు. హనుమాన్ మూవీతో పెద్ద హిట్ అందుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ( Prasanth Varma) కూడా డిమాండ్ చూపిస్తున్నారు. ఈ డైరెక్టర్ ని తట్టుకోలేక ఆహా( Aha) పూర్తిగా దూరం పెట్టేసింది.

బాలకృష్ణ హోస్ట్ చేస్తున్న 'అన్‌స్టాపబుల్' షో ప్రశాంత్ వర్మ (Prasanth Varma) డైరెక్ట్ చేశాడు. ఇప్పటివరకు మూడు సీజన్స్ విడుదలయ్యాయి. తాజాగా, నాలుగో సీజన్ స్టార్ట్ అయింది. అయితే, రెండు సీజన్స్‌కు సంబంధించిన ట్రైలర్ కట్ ను ప్రశాంత్ వర్మనే చూసుకున్నాడు. అప్పుడు రెమ్యునరేషన్ రీజనబుల్‌గానే డిమాండ్ చేశాడట. కానీ , ఇప్పుడు మాత్రం ఒక లెవెల్ చూపిస్తున్నాడని చెబుతున్నారు. నాలుగో సీజన్ షో ట్రైలర్‌ కట్ కోసం ఆహా టీం ప్రశాంత్ వర్మని సంప్రదించగా రూ.2 కోట్లు డిమాండ్ చేశాడని టాక్ నడుస్తుంది.

అయితే, చిన్న కట్ కోసం ఇంత పెద్ద మొత్తంలో డిమాండ్ చేయడం ఆహాకు నచ్చలేదట. అందుకే 'అన్‌స్టాపబుల్ 4' నుండి ప్రశాంత్ వర్మను దూరం పెట్టారట. అంతే కాకుండా, బాలయ్య (Balakrishna) కూడా ఈ డైరెక్టర్ పై సీరియస్‌ అయినట్లు తెలుస్తుంది.

Advertisement

Next Story