Balakrishna: బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్

by Prasanna |   ( Updated:2024-10-13 12:28:10.0  )
Balakrishna:  బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో సినిమా.. పోస్టర్ రిలీజ్ చేసిన మేకర్స్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలయ్య, బోయపాటి శ్రీను కాంబోలో ఏదైనా మూవీ వస్తే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటి వరకు వీరి కాంబోలో మన ముందుకొచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనకీ తెలిసిందే. .

అఖండ 2 ఉంటుందని అధికారికంగా ప్రకటించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా బోయపాటి శ్రీను డైరెక్షన్ లో బాలకృష్ణ హీరోగా సినిమాని అనౌన్స్ చేసారు. అయితే, ఈ సినిమా నుంచి ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు.

తాజాగా, ఈ రోజు దసరా సందర్భంగా బాలయ్య బోయపాటి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా ఓపెనింగ్ పూజా కార్యక్రమం అక్టోబర్ 16న చేస్తారని ప్రకటించారు. అలాగే, త్వరలోనే షూటింగ్ మొదలవుతుందని సమాచారం. పోస్టర్ లో BB4 అనే వర్కింగ్ టైటిల్ వెనుక అమ్మ వారి ఫోటో ఉండటంతో ఇది ఏ సినిమానా అని నందమూరి ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు.

Advertisement

Next Story