Unstoppable 4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోలో బాలయ్య బాబు గెటప్ అదిరిందిగా

by Prasanna |
Unstoppable 4: అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోలో బాలయ్య బాబు గెటప్ అదిరిందిగా
X

దిశ, వెబ్ డెస్క్ : హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అఖండ 2 మూవీ అనౌన్స్ నుంచి బాలయ్య బాబు వార్తల్లో నిలుస్తున్నారు. ఆహా ఓటీటీలో ప్రసారమయ్యే అన్‌స్టాపబుల్ విత్ NBK అనే షో ఇప్పటికి మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. సినిమాలు మాత్రమే కాకుండా హోస్టింగ్ లో కూడా బెస్ట్ అని ఈ షో తోనే ప్రూవ్ చేసాడు.

త్వరలో నాలుగో సీజన్ కూడా రాబోతుంది. అయితే, ఈ సీజన్ ప్రోమోని విడుదల చేశారు. ఈ సారి కొత్తగా డిజైన్ చేసి బాలయ్య బాబుని సూపర్ హీరోగా చూపించారు. దీంతో ఈ ప్రోమో నెట్టింట వైరల్ అయింది.

తాజాగా, అన్‌స్టాపబుల్ సీజన్ 4 ప్రోమో మేకింగ్ వీడియోని షేర్ చేసారు. ఆ వీడియోలో బాలయ్యను సూపర్ హీరోగా ఎలా డిజైన్ చేసారు, ఆ తర్వాత యానిమేషన్ ఎలా చేసారనేది చూపించారు. ఈ సీజన్ మూడు ఎపిసోడ్స్ షూట్ చేసారని తెలిసిన సమాచారం. అంతే కాకుండా, ఈ సీజన్ లో ఫస్ట్ ఎపిసోడ్ ఏపీ సీఎం చంద్రబాబుతో ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇక అన్‌స్టాపబుల్ సీజన్ 4 అక్టోబర్ 24 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story

Most Viewed