BAGHEERA TRAILER: ప్రశాంత్ నీల్ రచించిన ‘బఘీర’ ట్రైలర్ చూశారా?.. కేజీఎఫ్ స్టైయిల్లో ఉందిగా..

by Kavitha |
BAGHEERA TRAILER: ప్రశాంత్ నీల్ రచించిన ‘బఘీర’ ట్రైలర్ చూశారా?.. కేజీఎఫ్ స్టైయిల్లో ఉందిగా..
X

దిశ, సినిమా: కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్ సినిమాలతో సూపర్ క్రేజ్ క్రియేట్ చేసుకున్న సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ అందించిన కథతో కన్నడ స్టార్ శ్రీ మురళి హీరోగా, రుక్మిణి వసంత్ హీరోయిన్లుగా సూరీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బఘీర’. ఈ మూవీను హోంబల్ ఫిల్మ్స్ భారీ బడ్జేట్‌తో నిర్మిస్తోంది. అయితే తాజాగా ఈ మూవీ నుంచి ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ ట్రైలర్‌ను చూస్తుంటే మంచి యాక్షన్ ఫీస్ట్‌లా అనిపించింది. అమ్మ సెంటిమెంట్, ముసుగు వేసుకొని విలన్లని చంపడం లాంటివి కేజీ‌ఎఫ్ చిత్రాన్ని గుర్తు చేస్తున్నాయి. కాగా ఈ సినిమా ప్రశాంత్ నీల్ కథ కావడంతో బ్లాక్ అండ్ వైట్‌ ప్రేమ్స్‌లోనే తెరకెక్కింది.

ఇక ట్రైలర్‌‌ను బట్టి చూస్తే.. చిన్నప్పుడు తల్లి చనిపోయిన ఓ పిల్లాడు.. పెద్దయ్యాక పోలీస్ అవుతాడు. న్యాయం జరగట్లేదని, ముసుగు వేసుకొని ‘బఘీర’ గెటప్‌లో విలన్లని చంపుతుంటాడు. చివరకు బఘీరాని పోలీసులు పట్టుకున్నారా లేదా అనేదే స్టోరీలా అనిపిస్తుంది. కాగా కన్నడతో పాటు తెలుగులోనూ దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ కానుంది.

(video link credits to hombale films youtube channel)

Advertisement

Next Story

Most Viewed