- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bagheera: 'బఘీర' ఫస్ట్ సింగిల్ అప్‌డేట్.. పోస్టర్‌తోనే హైప్ పెంచేస్తు్న్న చిత్ర బృందం
దిశ, సినిమా: ‘ఉగ్రమ్’ ఫేమ్ రోరింగ్ స్టార్ శ్రీమురళి (Srimurali) తాజా ప్రాజెక్ట్ ‘బఘీర’ (Bagheera). ఎక్సయిటింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించగా.. డాక్టర్ సూరి (Suri) దర్శకత్వం వహిస్తున్నారు. హోంబలే ఫిలింస్ (Hombale Films) బ్యానర్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించిన ఈ చిత్రం గ్రేట్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ని అందించనుంది. ఇందులో రుక్మిణి వసంత్, ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.
థ్రిల్లింగ్ యాక్షన్, ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్, అద్భుతమైన విజువల్స్‌ని బ్లెండ్ చేసిన ఈ కన్నడ (Kannada) సినిమాను టాలీవుడ్ (Tollywood) టాప్ డిస్ట్రిబ్యూషన్ హౌస్ ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఇప్పుడు తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తోంది. ఇక దీపావళి కానుకగా అక్టోబర్ 31న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉన్న ‘బఘీర’ (Bagheera) నుంచి ఫస్ట్ సింగిల్ (First Single) ‘రుధిర హర’ అక్టోబర్ 17న ఉదయం 10:35 గంటలకు విడుదల చేయనున్నట్లు ప్రకటించారు చిత్ర బృందం. కాగా.. ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ప్రమోషన్స్ (Promotions) త్వరలో ప్రారంభం కానున్నట్లు తెలిపారు మూవీ టీమ్.