ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు

by S Gopi |
ఎయిడ్స్ నిర్మూలనపై అవగాహన సదస్సు
X

దిశ, బోథ్: చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ సంస్థ ఆధ్వర్యంలో బోథ్ బస్టాండ్ లో ఎయిడ్స్ నిర్మూలన మరియు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కలజాత బృందంవారు బోథ్ బస్టాండ్ లోని అంబేడ్కర్ చౌక్ వద్ద నాటిక మరియు పాటలు పాడి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా మాసం లక్ష్మీ వెల్ఫేర్ సొసైటీ చైర్మన్ మాసం అనిల్ కుమార్ హాజరై పోస్టర్ ఆవిష్కరణ చేశారు. అనంతరం కళజాత బృందం నాటికను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1951 లో సంస్థను ప్రారంభించారని, ఇప్పటివరకు తెలంగాణలోని 7 జిల్లాల్లో ఈ సంస్థ పని చేస్తుందన్నారు. ఈ సంస్థ ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాల్లో HIV నివారణ మరియు సుఖ వ్యాధులు అంటకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తదన్నారు. చైల్డ్ ఫండ్ లింక్ వర్కర్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై ప్రతి గ్రామంలో కళజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని.. ఇలా అవగాహన కల్పించడం వలన ప్రజలకు మేలు అవుతుందని తెలిపారు. ఎయిడ్స్ అనేది అంటు వ్యాధి కాదని.. నివారణ ఒకటే మార్గం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శశిమాల, లింక్ వర్కర్ నవనీత, కళజాత బృందం సభ్యులు రాజలింగు మరియు కాంగ్రెస్ నాయకులు మల్లెపూల సత్య నారాయణ, టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు కొట్టురి ప్రవీణ్, బద్దం దినేష్ రెడ్డి, అబ్బు మరియు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story