ఈ-శ్రమ్ పథకాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

by S Gopi |
ఈ-శ్రమ్ పథకాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలి: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
X

దిశ, నిర్మల్ కల్చరల్: అసంఘటిత రంగంలోని కార్మికులందరూ ఈ-శ్రమ్ పథకం ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన నిర్మల్ పట్టణంలోని రాజ రాజేశ్వర గార్డెన్స్ లో నిర్వహించిన ఈ-శ్రమ్ అవగాహన సదస్సుకు హాజరయ్యారు. పథకాన్ని కార్మికులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి అన్నారు. 18 సంవత్సరాల నుంచి 57 ఏళ్లు ఉన్న కార్మికులు ఈ పథకంలో చేరి ప్రయోజనాలు పొందాలన్నారు. కార్మికులకు పథకం ప్రయోజనాలపై కార్మిక శాఖ అధికారులు అవగాహన కల్పించారు.

పీఎఫ్ సభ్యత్వం లేని కార్మికులు, భవన మరియు ఇతర నిర్మాణరంగ కార్మికులు, కూరగాయల వ్యాపారులు, పెయింటర్స్, ఎలక్ట్రిషియన్స్, ప్లంబింగ్ పనివారు, వడ్డెర పనివారు, ఆటో మరియు ఇతర వాహన డ్రైవర్లు, మెకానిక్ లు, ఉపాధిహామీ కూలీలు, ఆశా వర్కర్స్, పాల వ్యాపారులు, వ్యవసాయ సంబంధిత ఉపాధుల పనివారు, ఆటో మొబైల్, రవాణా రంగం, డ్రైవర్లు, చేనేత, కమ్మరి, స్వర్ణకారులు, సేవారంగం పనివారు మరియు ఇతర అసంఘటిత రంగ కార్మికులు ఈ పథకానికి అర్హులని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, నిర్మల్ ఎంపీపీ రామేశ్వర్ రెడ్డి, కార్మికుల సంక్షేమ సమితి చైర్మన్ వి. దేవేందర్ రెడ్డి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వహీద్, సభ్యులు స్వదేశ్, జాయింట్ కమిషనర్ సునీత, కార్మికశాఖ సహాయ కమిషనర్ జి. శ్రావణి, సహాయ కార్మిక అధికారులు సాయిబాబా, జగదీష్ రెడ్డి కార్మిక సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed