- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
అనుకోకుండా మంత్రుల పర్యటన..ప్రసన్నం చేసుకోవడానికి అధికారుల తంటాలు
దిశ, వైరా : వైరా రిజర్వాయర్ సుందరీకరణకు రిజర్వాయర్ ఆనకట్టపై రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు హరితహారం కార్యక్రమంలో భాగంగా రూ.23లక్షల రూపాయల విలువైన పచ్చగడ్డి, మొక్కలను నాటారు. అయితే మొక్కలు నాటిన తర్వాత సంరక్షణ బాధ్యత మున్సిపాలిటీ శాఖ, నీటిపారుదల శాఖలు చూసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ నాడు మొక్కలు నాటిన తర్వాత నుండి నేటి వరకు పట్టించుకోలేదని పలువురు విమర్శిస్తున్నారు. మొక్కలకు నీరు లేక కొన్ని చోట్ల పూర్తిగా వాడిపోయి, విరిగిపోయి దర్శనమిస్తున్నాయి.
మొక్కలు నాటేటప్పుడు కనీసం మొక్కలు ఉన్న పాలిథిన్ కవర్లను కూడా తొలగించకుండా అలాగే నాటి హరితహారం కార్యక్రమంలో నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు నాలుగు ఫోటోలు దిగి చేతులు దులిపేసుకున్నారు. ప్రతిరోజు సాయంత్రం వాకింగ్‌కి వెళ్లే పాదచారులు ప్రకృతి ప్రేమికులకు నిరాశే ఎదురవుతుంది అని పలువురు వాపోతున్నారు. ఈ గ్రీన్ గ్రాస్‌ను ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు అయితే రెండు సంవత్సరాల వరకు సంరక్షణ బాధ్యత కాంట్రాక్టర్ దేనని అధికారులు ఒకవైపు చెప్పడం.. మరోవైపు తమకు సంబంధం లేదని ఆ బాధ్యత నీటిపారుదల శాఖ అధికారులు చూసుకోవాలని కాంట్రాక్టర్ చెప్పడం ఇరువురి వాదనలో ఎవరిది నిజమో తెలియని పరిస్థితి.
గ్రీన్ గ్రాస్ నాటిన నాటి నుండి ఈ మధ్య కాలం వరకు నీళ్ళు పోసే నాధుడు లేక పోవడంతో మొత్తం ఎండిపోయి బీడు భూమిని తలపించేలా తయారయింది. దీంతో అనుకోకుండా మంత్రుల పర్యటన మళ్లీ వైరా మున్సిపాలిటీ ఖరారు కావడంతో గత రెండు మూడు రోజుల నుండి మున్సిపల్ శాఖ, ఐబి శాఖ అధికారులు నానా అవస్థలు పడుతూ మంత్రులు పర్యటించే ప్రాంతం వరకు మాత్రమే రిజర్వాయర్ ఆనకట్టపై ఉన్న ఫుట్ పాత్ ల పక్కన ఉన్నటువంటి పిచ్చి మొక్కలను గడ్డిని తొలగించి మంత్రులను ప్రసన్నం చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు.