- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
3182 పుష్-అప్‌లతో ప్రపంచ రికార్డ్.. షాకింగ్ ఫీట్ చేసిన వ్యక్తి! (వీడియో)
దిశ, వెబ్‌డెస్క్ః అన్ని అందరూ చేయలేరు, కొన్ని ప్రపంచంలో ఒక్కరే చేయగలరు.. అలాంటి వారికే ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. వరల్డ్ రికార్డ్ దక్కుతుంది. ఈ రికార్డు ఇప్పుడు ఓ ఆస్ట్రేలియన్‌కు దక్కింది. అందరూ చేయగలిగిన చాలా సాధారణమైన పుష్-అప్‌లే ఇతడూ చేసింది. అయితే, అసాధారణ సంఖ్యలో చేసి, చూపించాడు. నిజానికి, శారీరక వ్యాయామాల్లో పుష్-అప్‌లు చాలా కష్టమైనవి కూడా. 50 పుష్-అప్‌లు ఒకేసారి పూర్తి చేయడం చాలా అచీవ్‌మెంట్‌గా పరిగణిస్తారు. కానీ కేవలం ఒక గంటలో 3182 పుష్-అప్‌లను చేయడం అసాధారణమే కాదు, ఆశ్చర్యం కూడా. ఇలాంటి అద్బుతమైన ప్రదర్శన ఇచ్చి ప్రపంచ రికార్డును క్లెయిమ్ చేశాడు ఇతడు! గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ వెబ్‌సైట్ సమాచారం మేరకు, 2021లో స్వదేశీయుడైన జరాడ్ యంగ్ (3054) నెలకొల్పిన రికార్డును తాజాగా డేనియల్ స్కాలీ అనే ఈ ఆస్ట్రేలియన్ అథ్లెట్ ఛేదించాడు. అందులోనూ CRPS (కాంప్లెక్స్ రీజినల్ పెయిన్ సిండ్రోమ్)తో బాధపడుతున్న స్కాలీ ఈ ఘనతను సాధించడం అందర్ని మరింత ఆశ్చర్యపరిచింది. గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నెట్‌లో పంచుకున్న ఈ విశేషం ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.