- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీజేరియన్లపై ఆడిట్.. ప్రతీ పారమీటర్లపై పరీక్ష
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సీజేరియన్లపై ఆడిట్ నిర్వహించేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ప్రభుత్వాసుపత్రుల్లో జరిగే సీజేరియన్లను తగ్గించేందుకు ఒక్కో గైనకాలజిస్టు వారీగా పని తీరును పరిశీలించనున్నారు. ప్రతీ పారమీటర్లపై పరీక్ష చేయనున్నారు. అంతేగాక హెల్త్ స్టాఫ్ ఏఎన్‌సీ చెకప్స్ సక్రమంగా నిర్వహిస్తున్నారా? లేదా? గర్భిణుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఎలా చూపుతున్నారు? వంటి వివరాలను కూడా సేకరించనున్నారు. ప్రభుత్వాసుపత్రుల్లో సాధారణ డెలివరీలను ప్రోత్సహించే విధంగా చర్యలు తీసుకోనున్నారు.
దీంతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో సిజేరియన్లు ఎందుకు ఎక్కువగా జరుగుతున్నాయనే దానిపై ఆరా తీస్తున్నారు. సీ సెక్షన్లను తగ్గించేందుకు డీఎమ్హెచ్ఓలు, డిప్యూటీ డీఎమ్హెచ్ఓల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రణాళికను రూపొందించాలని సర్కార్ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో పాటు ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందేందుకు ఫీల్డ్ విజిట్స్ చేసి ఒక రిపోర్టును ఇవ్వాలని సర్కార్ డీఎమ్హెచ్ఓలను కోరింది.
సబ్ సెంటర్లూ చెకింగ్..
రాష్ట్రంలో సబ్ సెంటర్, పీహెచ్‌సీల వారీగా పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించాలని సర్కార్ డీఎమ్హెచ్ఓలను సూచించింది. ఏఎన్‌సీ చెకప్స్, డెలివరీలు, ఎన్‌సీడీ ప్రోగ్రాం, వ్యాక్సినేషన్ తదితర కార్యక్రమాల అమలు తీరును క్షేత్రస్థాయి నుంచి సమీక్షించాలని పేర్కొన్నది. దీంతో పాటు మందులు, వైద్య పరికరాలు, సిబ్బంది కొరత సహా మరే ఇతర ఇబ్బందులు లేకుండా చూడాల్సిన బాధ్యత డీఎమ్హెచ్ఓలదేనని సర్కార్ నొక్కి చెప్పింది. ప్రభుత్వ కృషికి తోడు ఆరోగ్య శాఖలోని ప్రతి ఒక్క సిబ్బంది బాధ్యతతో సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది.
ఎన్హెచ్ ఎమ్ పై నిఘా..
నేషనల్ హెల్త్ మిషన్ లో భాగంగా రాష్ట్రంలో అమలవుతున్న మెటర్నల్ హెల్త్, చైల్డ్ హెల్త్, మిడ్ వైఫరీ, నేషనల్ క్వాలిటీ అష్యురెన్స్ ప్రొగ్రాం, బస్తీ దవాఖానలు, 108, కేసీఆర్ కిట్లు, టి- డయాగ్నోస్టిక్స్, ఎన్‌సీడీ స్క్రీనింగ్, టీబీ, సాంక్రమిక, ఆసాంక్రమిక వ్యాధులు తదితర విభాగాల పురోగతిని ఎప్పటికప్పుడు పరిశీలించాలని ఆయా హెచ్ఓడీలకు సర్కార్ సీరియస్గా సూచించింది. కొందరు అధికారుల నిర్లక్ష్యంగా స్కీంలకు చెడ్డపేరు వచ్చేలా ఉన్నట్లు అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికైనా పని తీరులో మార్పు రావాలని, లేదంటే చర్యలు తీసుకోవాల్సి వస్తుందని నొక్కి చెప్పింది.