- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చినజీయర్ స్వామి పై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి: ఓయూ విద్యార్థి నాయకులు
దిశ, సికింద్రాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో వన దేవతలు గా కొలిచే సమ్మక్క సారలమ్మల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చిన్న జీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ఓయూ పోలీస్ స్టేషన్‌లో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు మాదిగ స్టూడెంట్ యూనియన్, విద్యార్థి జన సమితి నాయకులు బుధవారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మాదిగ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కొంగరి శంకర్ మాదిగ, విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు బాబు మహాజన్, విద్యార్థి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాసంపల్లి అరుణ్ కుమార్‌లు మాట్లాడుతూ.. ఇటీవల ఆంధ్ర ప్రాంతానికి చెందిన చినజీయర్ స్వామి ఒక ఆధ్యాత్మిక సమావేశంలో మాట్లాడుతూ.. ఆదివాసీ ప్రకృతి దేవతలు తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీకలుగా ఉన్న సమ్మక్క, సారలమ్మలను అదేదో దేవతలు గ్రామ దేవతలు వారు ఏమైనా బ్రహ్మలోకం నుండి దిగి వచ్చారా.. వారు దేవతలు కారని వారిని ఆరాధించడం చెడుకు దారితీస్తుందని కించపరుస్తూ.. అసభ్య పదజాలంతో మాట్లాడి తెలంగాణ ప్రజల, అమ్మ వార్ల భక్తుల మనోభావాలను కించపరిచాడని మండిపడ్డారు.
చిన్న జీయర్ స్వామి వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో భక్తుల మనోభావాలు మరింత దెబ్బతింటున్నాయన్నారు. ఆదివాసీ దేవతలైన సమ్మక్క సారలమ్మలను తన విషపూరిత మాటలతో అవమానించిన చినజీయర్ స్వామి పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు, క్రిమినల్ కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని వారు ఓయూ ఇన్స్‌పెక్టర్ రమేష్ నాయక్ ను కోరారు. కార్యక్రమంలో మాదిగ స్టూడెంట్ యూనియన్ ఓయూ అధ్యక్షుడు బొర్రా శాంతి కుమార్ , మురళి , రాజేష్ , కుమార్ , రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు.