Smartphone care: చౌకగా వచ్చే స్మార్ట్​ఫోన్​ కేస్​ ఉపయోగిస్తున్నారా? డ్యూరెబులిటీ దెబ్బతిన్నట్లే..!

by Anjali |
Smartphone care: చౌకగా వచ్చే స్మార్ట్​ఫోన్​ కేస్​ ఉపయోగిస్తున్నారా? డ్యూరెబులిటీ దెబ్బతిన్నట్లే..!
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుత రోజుల్లో స్మార్ట్ ఫోన్‌(Smart phone)కు ఎంత అడిక్ట్ అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే ఫోన్ కొనేముందు చాలా రీసెర్చ్ చేసి కొంటారు. కానీ తర్వాత చేసే చిన్న తప్పుల వల్ల మొబైల్ పాడైపోతుంటుంది. స్మార్ట్ ఫోన్ పర్ఫామెన్స్, బ్యూరెబులిటీ(Burability) దెబ్బతింటాయి. మీ డివైజ్‌ను పాడుచేసేవేంటో ఇప్పుడు తెలుసుకోండి.

రాత్రిపూట ఛార్జింగ్ చేయడం..

మీ ఫోన్ నైట్ మొత్తం ఛార్జింగ్ పెట్టవద్దు. దీంతో బ్యాటరీపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఫలితంగా బ్యాటరీ ఫాస్ట్‌గా పాడైపోతుంది. కాగా మొబైల్ ఛార్జ్ అయ్యాక తీయడం మేలు. యూవీ క్యూర్డ్ టెంపర్ గ్లాస్(UV cured tempered glass) విషయంలో తప్పక కేర్ తీసుకోవాలి. ఎందుకంటే ఈ తరహా గ్లాస్ ను పెట్టడానికి జిగురైన పదార్థాన్ని వాడుతారు. ఇది ఇయర్ పీస్(Ear piece), బటన్లు, స్వీకర్లలోకి చొచ్చుకుపోతుంది. కాగా యూవీ-క్యూర్డ్ టెంపర్డ్ గ్లాస్ ప్రొటెక్టర్లకు దూరంగా ఉండటం బెటర్.

మీ షర్ట్​తో ఫోన్​ను క్లీన్ చేస్తున్నారా..?

ఫోన్ పై మురికిగా ఉంటే చాలా మంది వేసుకున్న క్లాత్ తోనే తుడుస్తుంటారు. దీంతో ఆ దుమ్ము స్క్రీన్ పై మరింత పేరుకుపోతుంది. డిస్ ప్లే, బాడీపై స్క్రాచెస్ కు కారణమవుతుంది. కాగా ఎలక్ట్రానిక్స్ కోసం చౌకైన మైక్రోఫైబర్ క్లాత్(Microfiber cloth) ను యూజ్ చేయడం మంచిది. అలాగే ఓవర్ వాటర్ లో మొబైల్ ను ఉపయోగించకూడదు. కాగా బీచ్ లాంటి ప్రదేశాలకు వెళ్లినప్పుడు బయటకు వచ్చాక ఫోన్ యూజ్ చేయండి. లేకపోతే తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది.

తక్కువ ధరకు ఫోన్ కొంటున్నారా..?

అలాగే చౌకైన ఫోన్ కేస్ కొనుగోలు చాలా మందికి కంపార్ట్ గా అనిపిస్తుంది. కాలక్రమేణా ఈ తరహా స్మార్ట్ ఫోన్లు నష్టానికి దారితీస్తాయి. దుమ్ము, ధూళి అనేవి కేస్, ఫోన్ మధ్య చిక్కుకుంటాయి. ఫోన్ హ్యాండిల్ చేసినప్పుడల్లా, ఉంచినప్పుడల్లా నొక్కుకుపోతుంది.ఈ కారణంగా మొబైల్ పై గీతలు పడుతుంటాయి.

Advertisement

Next Story

Most Viewed