దేశ‌వ్యాప్త స‌మ్మెను విజ‌య‌వంతం చేయాలి: ఆంజనేయులు

by S Gopi |
దేశ‌వ్యాప్త స‌మ్మెను విజ‌య‌వంతం చేయాలి: ఆంజనేయులు
X

దిశ‌, అబ్దుల్లాపూర్‌మెట్‌: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిర‌సిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో నిర్వహించతలపెట్టిన దేశ‌వ్యాప్త సమ్మెను విజయవంతం చేయాల‌ని తెలంగాణ డ్రైవర్స్ & ఓనర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు దూపం ఆంజనేయులు డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మీటర్ టాక్సీ చట్టాన్ని అమలు పరచాలన్నారు. బ్యాడ్జి కలిగిన ప్రతి డ్రైవర్‌కు ప్రత్యేకంగా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాల‌ని, ఇతర రాష్ట్రాల వాహనాలు హైద‌రాబాద్‌లో న‌డుస్తున్న కారణంగా ఇక్కడి డ్రైవర్ల ఆర్థిక ప‌రిస్థితుల‌పై ప్రభావం పడుతోంద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్‌లను ర‌ద్దు చేయాల‌న్నారు.

Advertisement

Next Story