'రారా రెడ్డి' అంటున్న అంజలి..

by S Gopi |
రారా రెడ్డి అంటున్న అంజలి..
X

దిశ, సినిమా: 'సరైనోడు' మూవీలో 'బ్లాక్ బస్టర్' ఐటెమ్ సాంగ్‌‌తో మెప్పించిన హీరోయిన్ అంజలి.. అమేజింగ్ మూవ్స్‌తో వావ్ అనిపించేసింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత 'మాచర్ల నియోజకవర్గం'లో స్పెషల్ సాంగ్‌తో మాస్ స్టెప్స్ వేయించేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే 'రారా రెడ్డి' పాటకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా.. హీరో నితిన్‌తో చేసిన డ్యాన్స్ మూవ్స్‌లో ఊర మాస్ అవతార్‌లో కనిపించింది. కాగా M.S రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి, కేథరిన్ కథానాయికలు కాగా ఆగస్టులో మూవీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్.

Advertisement

Next Story