Andrea Jeremiah: ఆండ్రియా నగ్నంగా నటించిన ‘పిశాచి-2’ సినిమా విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?

by Hamsa |   ( Updated:2024-11-03 10:35:58.0  )
Andrea Jeremiah: ఆండ్రియా నగ్నంగా నటించిన ‘పిశాచి-2’ సినిమా విడుదల వాయిదా.. కారణం ఏంటంటే?
X

దిశ, సినిమా: కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మిష్కిన్(Mishkin) తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ ‘పిశాచి-2’. అయితే ఈ సినిమా 2014లో వచ్చిన బ్లాక్ బస్టర్ హిట్ ‘పిశాచి’ (Pisachi)చిత్రానికి సీక్వెల్‌గా రాబోతుంది. రాక్‌ఫోర్ట్ బ్యానర్‌(Rockfort Banner)పై మురుగానందం నిర్మించిన పిశాచి-2లో ఆండ్రియా జర్మియా(Andrea Jeremiah), విజయ్ సేతుపతి జంటగా నటించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది.

ఈ క్రమంలో.. తాజాగా, పిశాచి-2(Pisachi-2) మేకర్స్ చిక్కుల్లో పడినట్లు సమాచారం. ఈ మూవీ విడుదల చేయడానికి అనుమతి ఇవ్వొద్దని ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ కంపెనీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్లు టాక్. ఓ సినిమా హక్కులను పొందిన రాక్ ఫోర్ట్ తమ ఒప్పందం ప్రకారం రూ. 4.85 కోట్లు చెల్లించాల్సి ఉందని అవి ఇచ్చాకే ‘పిశాచి-2’ (Pisachi-2)విడుదల చేయాలని పేర్కొన్నారు. ఇక ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఫ్లయింగ్ హార్స్ పిక్చర్స్ వారు రాక్‌ఫోర్డ్ వారికి మొత్తం రూ.1.85 కోట్లు చెల్లించాకే ‘పిశాచి-2’ విడుదల చేయాలని తెలిపింది.

అంతేకాకుండా నవంబర్ 18 వరకు ఈ కేసును వాయిదా వేసింది. కాగా, ఈ సినిమాలో ఆండ్రియా నగ్నంగా నటించినట్లు సమాచారం. ఈ విషయాన్ని డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో భాగంగా వెల్లడించారు. ఆండ్రియాకు సన్నిహితురాలు అయిన ఫొటోగ్రాఫర్‌తో ఫొటోలు తీయించాము. కానీ సన్నివేశాలు షూట్ చేయలేదు. అయితే ఆండ్రియా(Andrea Jeremiah) మాత్రం ‘పిశాచి-2’ లో నగ్నంగా నటించింది నిజమే అని వెల్లడించారు. ప్రజెంట్ డైరెక్టర్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.


Read More..

తను నీది.. సో ఆమెను జాగ్రత్తగా చూసుకో.. బాడ్మింటన్ స్టార్ ప్లేయర్‌కు నేషనల్ క్రష్ స్వీట్ వార్నింగ్

Advertisement

Next Story