- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Anasuya Bharadwaj: నా భర్త ఆ కోరిక తీర్చడం లేదు.. రంగమ్మత్త బోల్డ్ కామెంట్స్.. !
దిశ, వెబ్‌డెస్క్: స్టార్ యాంకర్ కమ్ నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యాంకర్‌గా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. నేడు పాన్ ఇండియా మూవీలో కీరోల్‌లో నటించే స్థాయికి ఎదిగింది. ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్‌లో అల్లు అర్జున్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా ‘పుష్ప’ సీక్వెల్‌గా వస్తున్న ‘పుష్ప2’ మూవీలో అనసూయ నటిస్తోంది. ఈ సినిమాలో దాక్షాయణిగా నెగటివ్ రోల్‌లో మెప్పించడానికి రెడీగా ఉంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటోంది. ఈ క్రమంలో ఈ అమ్మడుకు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. అదేంటంటే..
అనసూయకు ఇద్దరు కుమారులు ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఈ ముద్దుగుమ్మకు అమ్మాయిలు అంటే విపరీతమైన ఇష్టం ఉందట. కానీ తన భర్త ఇద్దరు పిల్లలు చాలు ముగ్గురు వద్దు అని అంటున్నాడట. అయితే ప్రతి ఇంట్లో ఓ అమ్మాయి పుట్టాలని, అమ్మాయిలు ఉంటేనే ఇల్లుకు అందం అని అనసూయ అంటోందట. దానికి అనసూయ భర్త ఒప్పుకోలేదట. దీంతో ఈ బ్యూటీ.. భర్త తన కోరిక తీర్చడం లేదంటూ తన ఆవేదనను తెలిపింది. కాగా ఈ విషయాన్ని అనసూయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.