'నన్ను ఏమి చేయాలేరు.. ఏమైనా జరుగుతే వారి పేర్లు చెప్పేస్తా'

by Satheesh |   ( Updated:2022-03-19 09:35:23.0  )
నన్ను ఏమి చేయాలేరు.. ఏమైనా జరుగుతే వారి పేర్లు చెప్పేస్తా
X

దిశ, మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండల మున్సిపాలిటీ కార్యాలయంలో అవుట్ సోర్స్ ఉద్యోగిగా పని చేసే ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడుతున్నాడనే ఆరోపణలు వస్తు్న్న జిల్లా అధికారులు మాత్రం నిమ్మకునీరెత్తినట్లు వ్యవరిస్తున్నారని మున్సిపాలిటీ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇంజనీరింగ్ వర్క్ ఇన్స్పెక్టర్ చేసిన అవినీతిపై విలేకరులు పత్రికలలో వార్త కథనాలు ప్రచురిస్తుంటే, నాకు ఏమైనా భయమా.. ఇలాంటివి చాలా చూసా అని అంటున్నట్లు సమాచారం. విలేకరులు ఎన్ని వార్త కథనాలు రాసుకున్న నేను ఏమి చేయాలో నాకు తెలుసులే అనే విధంగా వ్యవహరిస్తున్నాడని తోటి ఉద్యోగులు చెప్పుకొస్తున్నారు. అవుట్ సోర్స్ ఉద్యోగి ఈ విధమైన ధీమాగా ఉన్నడంటే ఆతడి వెనుక ఏ అధికారులు ఉన్నారనే చర్చ మున్సిపాలిటీలో జోరుగా సాగుతోంది. జిల్లా అధికారులు ఇంక్వెరీ చేసి.. చర్యలు తీసుకుంటే నా వెనుక ఉన్న అధికారుల పేర్లు, రాజకీయ నాయకుల పేర్లు చెబుతున్నాడనే ఆరోపణలు వినిపిస్తు్న్నాయి.

దీన్ని బట్టి చూస్తే ఈ అవుట్ సోర్స్ ఉద్యోగిపై జిల్లా అధికారులు, సీడీఎమ్ఏ అధికారులు చర్యలు తీసుకుంటే ఇతని వెనుక ఉన్న అసలు వ్యక్తులు బయటకు వస్తారని మున్సిపాలిటీ ప్రజలు చర్చించుకుంటున్నారు. మద్యం సేవించి కార్యాలయానికి వస్తున్నాడనే ఆరోపణలు సైతం ఉన్నాయి. మున్సిపాలిటీలో ఇంత జరుగుతున్న కమిషనర్, ఏఈ అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నరనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ అవుట్ సోర్స్ ఉద్యోగి ఎంత ముడుపులు పుచ్చుకున్న దానిలో కొంతవాటా ఏఈ అధికారి పోతుందనే ఆరోపణలు కూడా బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి వెనుక స్థానిక అధికార పార్టీ కీలక నాయకుడు, జిల్లా అధికారులు ఉండి నడిపిస్తున్నారని ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి వీరిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Next Story