టెన్త్ క్లాస్ విద్యార్థినిని తల్లిని చేసిన కామాంధుడు

by Vinod kumar |
టెన్త్ క్లాస్ విద్యార్థినిని తల్లిని చేసిన కామాంధుడు
X

దిశ, ఏపీ బ్యూరో: ఎలక్ట్రీషియన్‌ ఇంట్లో అడుగుపెట్టాడు. ఆ ఇంట్లో ఉన్న పదో తరగతి చదువుతున్న బాలికపై కన్నేశాడు. బాలికతో మాటలు కలిపాడు. అనంతరం ఆమెను ఫాలో అయ్యేవాడు. ఒకరోజు స్కూలుకు ఒంటరిగా వెళ్తున్న ఆ యువతిని బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. ఆ సమయంలో వీడియో తీసి మరీ పైశాచిక ఆనందం పొందాడు. తన కోరిక తీర్చకపోయినా.. ఈ విషయాన్ని బయటపెట్టిన వీడియో బయటపెడతానంటూ భయపెట్టి మరీ కోరిక తీర్చుకున్నాడు. అలా ఒకటి కాదు రెండు కాదు పలుమార్లు తన కోరిక తీర్చుకున్నాడు. చివరకు ఆ బాలిక గర్భం దాల్చింది. ఓ బిడ్డకు జన్మినిచ్చింది. ఈ షాకింగ్ ఘటన చిత్తూరు జిల్లా రొంపిచర్లలో చోటు చేసుకుంది.


వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లా రొంపిచర్ల మండలం లో బాధిత బాలిక బంధువుల ఇంట్లో ఉంటుంది. బంధువుల ఇంటి దగ్గర ఉంటూ ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటుంది. అయితే ఓ రోజు ఇంట్లో కరెంట్ సరఫరా నిలిచిపోవడంతో పీలేరు మండలం ఎర్రగుంట్లపల్లెకు చెందిన రాజేశ్(34)ఎలక్ట్రీషియన్‌ను పిలిచారు. అయితే ఆ సమయంలో బాలికపై కన్నేశాడు. బాలిక కదలికలను గమనించి ఓ రోజు బలవంతంగా అత్యాచారం చేశాడు. ఆ దారుణాన్ని సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.

ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే వీడియో సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తానని బెదిరించి పలుమార్లు లొంగదీసుకున్నాడు. ఈ విషయం ఇంట్లో చెప్తే తన కుటుంబం పరువు పోతుందని.. తన చదువు మధ్యలోనే ఆగిపోతుందని భయపడిన బాలిక ఈ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. కనీసం తన శరీరంలో మార్పులను కూడా గమనించుకో లేకపోయింది. అయితే 10రోజులుగా కడుపునొప్పితో బాధపడుతున్న బాలిక స్కూల్‌కి వెళ్లడం లేదు. ఈ విషయాన్ని బంధువులు బాలిక తల్లిదండ్రులకు తెలియజేయగా వారు రొంపిచర్లలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జాయిన్ చేయగా గురువారం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నట్లు బాలిక తల్లిదండ్రులు తెలిపారు.


అనంతరం తల్లిదండ్రులు ఈ ఘోరానికి ఒడిగట్టింది ఎవరని ప్రశ్నించగా ఎలక్ట్రీషియన్ రాజేష్ పేరు చెప్పింది. దీంతో బాలిక తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడు రాజేష్ ను అదుపులోకి తీసుకున్నట్లు రొంపిచర్ల ఎస్ఐ వెంకటేశ్వర్లు వెల్లడించారు. ప్రాథమిక విచారణలో ఇప్పటికే రాజేశ్‌కు వివాహం అయ్యిందని.. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు విచారణలో తేలిందని ఎస్ఐ వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story