ఉన్నత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ

by Manoj |
ఉన్నత స్థాయి సమావేశంలో కీలక అంశాలపై చర్చించిన ప్రధాని మోడీ
X

న్యూఢిల్లీ: రక్షణ రంగంలో భారతదేశాన్ని స్వావలంబనగా మార్చాలని ప్రధాని మోడీ అన్నారు. దేశ భద్రత, ఉక్రెయిన్-రష్యా యుద్ధ పరిస్థితులపై ఆదివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ పరిస్థితులు, ఆపరేషన్ గంగాలో ఉక్రెయిన్ నుంచి భారతీయుల తరలింపు, ఇతర దేశాల పౌరుల తరలింపు వంటి అంశాలపై ప్రధానంగా చర్చించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.

అంతేకాకుండా ఖర్కీవ్‌లో మరణించిన భారత విద్యార్థి నవీన్ శేఖరప్పను తీసుకురావడానికి అన్ని చర్యలు తీసుకోవాలని ప్రధాని అధికారులను ఆదేశించారు. రక్షణ రంగంలో భారత్‌ను స్వావలంబనగా మార్చేందుకు అన్ని విధాలా కృషి చేయాలని ప్రధాని పునరుద్ఘాటించారు. రక్షణ రంగంలో గ్లోబల్ టెక్ వినియోగం మరియు భారతదేశం యొక్క పురోగతిని కూడా ప్రధాని మోదీ సవివరంగా పరిశీలించారు. భారత్ భద్రతా యంత్రాంగంలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమగ్రపరచాలని కూడా ప్రధాని మోదీ ఉద్ఘాటించారు. దీంతో మన భద్రత బలోపేతం అవడమే కాకుండా ఆర్థిక వృద్ది పెరుగుతుందని తెలిపారని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు నిర్మలా సీతారామన్, రాజ్ నాథ్ సింగ్, జైశంకర్ తో పాటు ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, త్రివిధ దళాల చీఫ్ లు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed