- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
- Union Budget 2025-2026
Ameesha Patel: నాకు చెప్పకుండానే ఆ సీన్ మార్చేశారు.. డైరెక్టర్‌పై పవన్ కల్యాణ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ‘బద్రి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచమైన బ్యూటీ అమీషా పటేల్ (Ameesha Patel).. మొదటి చిత్రంతోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కానీ తర్వాత తెలుగులో మరో చిత్రం చెయ్యలేదు. ఇక గతేడాది ‘గదర్ 2’ (Gadar 2)తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసింది. 2001లో వచ్చిన ‘గదర్ ఏక్ ప్రేమ్‌కథ’కు సీక్వెల్‌గా ‘గదర్ 2’ వచ్చిన సంగతి తెలిసిందే. సన్నీ దేవోల్ (Sunny Devol), అమీషా పటేల్ (Ameesha Patel) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం గతేడాది విడుదలై మంచి సక్సెస్‌ను అందుకుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అమీషా పటేల్ ‘గదర్ 2’ డైరెక్టర్ అనిల్ శర్మ (Anil Sharma)పై షాకింగ్ కామెంట్స్ చేసింది.
‘2001లో వచ్చిన ‘గదర్’ చిత్రం సూపర్ సక్సెస్ అందుకోవడంతో.. ‘గదర్ 2’ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దీంతో ఈ మూవీ క్లైమాక్స్‌ను అద్భుతంగా ప్లాన్ చేశారు డైరెక్టర్ అనిల్ శర్మ. మొదటి ప్రతి నాయకుడి పాత్రను సకీనానే (అమీషా పటేల్) చంపాలని ఆయన తెలిపారు. అది నాతో పాటు అందరికి చాలా నచ్చింది. నిర్మాత కూడా ఒప్పుకున్నారు. కానీ, షూట్‌కి వచ్చేసరికి అనిల్ సీన్ మార్చేశారు. ప్రతి నాయకుడి పాత్రను చరణ్ జీత్ (Charan Jeet) (అనిల్ శర్మ కొడుకు ఉత్కర్ష శర్మ)ను చంపేలా సీన్ క్రియేట్ చేశారు. షూట్ జరిగే వరకు దీని గురించి నాకు తెలియదు. ఒక్క మాట కూడా నాకు చెప్పకుండానే సీన్ మార్చేశారు. అయినప్పటికీ ఆయన అంటే నాకెంతో గౌరవం. ఏదేమైనా ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ (Box office) వద్ద మంచి విజయాన్ని అందుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది’ అంటూ అమీషా పటేల్ చెప్పుకొచ్చింది.