- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Rasamayi: గద్దర్ సభలో అభ్యంతరకరంగా వ్యాఖ్యలు

దిశ, తెలంగాణ బ్యూరో: రవీంద్ర భారతిలో గద్దర్ జయంతి సభ కాంగ్రెస్ ఉత్సవ సభగా మారిందని.. హంతకులే సంతాప సభ పెట్టినట్టు ఉందని మాజీఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. గద్దర్‌కు కాలికి తాము గజ్జెలుగా పనిచేశామని.. జయంతి సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని పేర్కొన్నారు. గద్దర్‌కు కులం, వర్గం ఏమీ లేదని.. కానీ, సభకు కేవలం ఒకే వర్గాన్ని పిలిచారని అన్నారు. తాము లేకపోతే గద్దర్ లేనట్టుగా ప్రభుత్వ పెద్దలు మాట్లాడారని.. ఇది చాలా దుర్మార్గమని తెలిపారు. గద్దర్ ఏనాడైనా అవార్డులకు పాకులాడారా? అని ప్రశ్నించారు. పద్మశ్రీ అవార్డులపై వ్యతిరేక భావనతో ఉన్న గద్దర్ పేరును రేవంత్.. పద్మశ్రీ అవార్డుకు ఎలా సిఫారసు చేస్తారని నిలదీశారు.
గతంలో ఆయన నంది అవార్డును సైతం తిరస్కరించిన విషయాన్ని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమ వ్యాప్తికి కృషి చేసింది గద్దర్ అయితే.. ఉద్యమంపై తుపాకీ ఎక్కుపెట్టింది రేవంత్ కాదా? అని ప్రశ్నించారు. అసలు గద్దర్‌పై కాల్పులు జరిపించింది రేవంత్ గురువు చంద్రబాబే కదా అని అడిగారు. గద్దర్ చివరి దాకా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పోరాడారని.. మాయ చేసి రాహుల్ జోడో యాత్రకు తీసుకెళ్లారని పేర్కొన్నారు. భట్టి పాదయాత్రకు తీసుకెళ్లి నడిపించారని.. ఆయన వల్లే గద్దర్ చనిపోయారని ఆరోపించారు. రేవంత్.. గద్దర్ పేరు గల్లీకి కాదు మెదక్ జిల్లాకు లేదంటే ఏదైనా యూనివర్సిటీకి పెట్టాలని డిమాండ్ చేశారు.