- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంజీ ట్రోఫీలో కోహ్లీ విఫలం.. కీలక వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు
by Harish |

X
దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి మాజీ క్రికెటర్ అంబటి రాయుడు మద్దతుగా నిలిచాడు. కోహ్లీ రంజీలు ఆడాల్సిన అవసరం లేదన్నాడు. 12 ఏళ్ల తర్వాత విరాట్ రంజీ ట్రోఫీలో పాల్గొన్న విషయం తెలిసిందే. రైల్వేస్‌తో జరిగిన మ్యాచ్‌లో ఢిల్లీకి ఆడిన అతను 6 పరుగులకే అవుటై నిరాశపరిచాడు. ఈ క్రమంలో విరాట్‌కు మద్దతుగా రాయుడు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టాడు. ‘ప్రస్తుతం కోహ్లీ రంజీలు ఆడాల్సిన అవసరం లేదు. 81 సెంచరీలు చేసే వరకు అతని టెక్నిక్ బాగానే ఉంది. ఇకమీదట కూడా బాగానే ఉంటుంది. అతన్ని ఎవరు బలవంతం చేయకండి. అతనికి కాస్త సమయం ఇవ్వండి. అతన్ని మనం నమ్మాలి. గౌరవించాలి. ముఖ్యంగా కోహ్లీని ఒంటరిగా వదిలివేయాలి. అప్పుడు అతడి లోపల ఉన్న జ్వాల దానంతట అదే మండుతుంది.’ అని రాసుకొచ్చాడు.
Next Story