- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
U19 T20 World Cup : అమ్మాయిలు టైటిల్ నిలబెట్టుకుంటారా?.. టైటిల్ పోరులో సాతాఫ్రికాతో తాడోపేడో

దిశ, స్పోర్ట్స్ : 2023లో తొలిసారిగా మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్ మొదలైంది. అప్పుడు టైటిల్ మనదే. వరుసగా రెండోసారి టైటిల్‌పై భారత యువ మహిళల జట్టు కన్నేసింది. మలేసియాలో జరుగుతున్న టోర్నీలో జైత్రయాత్ర కొనసాగిస్తూ ఫైనల్‌లో అడుగుపెట్టింది. ఆదివారం జరిగే టైటిల్ పోరులో సౌతాఫ్రికాతో తలపడనుంది. టోర్నీలో భారత్ ఒక్క ఓటమి కూడా పొందలేదు. వరుసగా ఐదు మ్యాచ్‌ల్లో నెగ్గడం విశేషం. ఎదురొచ్చినా ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తూ వచ్చింది. ఫైనల్‌లోనూ సౌతాఫ్రికాపై అదే జోరు కొనసాగించి టైటిల్ నిలబెట్టుకోవాలని భారత్ ఉవ్విళ్లూరుతున్నది. మరోవైపు, సౌతాఫ్రికాను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. ఆ జట్టు కూడా టోర్నీలో ఒక్క ఓటమి కూడా పొందలేదు. అయితే, ఏ రకంగా చూసుకున్నా ఫైనల్‌లో టీమిండియానే ఫేవరెట్.
అందరి దృష్టి త్రిషపైనే
టోర్నీలో తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష అద్భుత ప్రదర్శన చేస్తున్నది. 6 మ్యాచ్‌ల్లో సెంచరీతో సహా 265 పరుగులు చేసింది. ఆమెనే టాప్ స్కోరర్ కావడం విశేషం. అలాగే, 4 వికెట్లు కూడా ఆమె ఖాతాలో ఉన్నాయి. దీంతో ఫైనల్‌లో అందరి దృష్టి త్రిషపైనే ఉంది. త్రిషకు తోడు కమలిని కూడా మంచి ఫామ్‌లో ఉంది. బ్యాటింగ్‌లో వీరిద్దరూ భారత్‌కు ప్రధాన బలం. మరోవైపు, బౌలింగ్ పరంగా కూడా జట్టుకు ఢోకా లేదు. స్పిన్నర్లు వైష్ణవి శర్మ, ఆయుషి శుక్లా ప్రత్యర్థి జట్లను బెంబేలెత్తిస్తున్నారు. 15 వికెట్లతో వైష్ణవి టోర్నీలో అత్యధిక వికెట్లు తీయగా.. రెండో స్థానం ఆయుషిదే(12 వికెట్లు). మరో స్పిన్నర్ పారుణిక సిసోడియా(8 వికెట్లు), పేసర్ జోషిత(6 వికెట్లు) కూడా టచ్‌లో ఉన్నారు. పటిష్టమైన భారత బౌలింగ్ దళం ఎదుర్కోవడం సౌతాఫ్రికాకు సవాల్‌తో కూడుకున్నదే.