Amarnath Yatra: అమర్‌నాథ్ యాత్రకు బ్రేక్..

by GSrikanth |   ( Updated:2022-07-05 13:46:54.0  )
Amarnath Yatra Temporarily Suspended Due To Bad Weather
X

శ్రీనగర్: Amarnath Yatra Temporarily Suspended Due To Bad Weather| ప్రసిద్ధ యాత్ర అమర్ నాథ్ యాత్ర వాతావరణ పరిస్థితులు ప్రభావంతో తాత్కాలికంగా వాయిదా వేశారు. దాదాపు రెండేళ్ల విరామం తర్వాత గత నెల 30న ప్రారంభమైన ఈ యాత్రకు వారం రోజులకే ఆటంకం ఏర్పడింది. పహల్గామ్‌లోని నున్వాన్ బేస్ క్యాంప్ నుండి సహజంగా ఏర్పడిన మంచు-శివలింగం ఉన్న గుహ మందిరం వైపు యాత్రికులు వెళ్లడానికి అనుమతించడం లేదని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం పహల్గామ్ లోని నున్వాన్ బేస్ క్యాంపు వద్ద సుమారు 3,000 మంది యాత్రికులను నిలిపివేశారు.

జమ్మూ నుండి పహల్గాం మార్గంలో బయలుదేరిన దాదాపు 4,000 మంది యాత్రికుల బ్యాచ్ రాంబన్ జిల్లాలోని చందర్‌కోట్‌లోని యాత్రి నివాస్‌లో ఆపినట్లు చెప్పారు. అయితే జమ్ము బల్తాల్ మార్గం ద్వారా మాత్రం 2,000 మంది భక్తులను అనుమతిస్తున్నారు. జూన్ 30న ప్రారంభమైన మంచు శివలింగ దర్శన యాత్రను ఇప్పటివరకు 72,000 మందికి పైగా దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు. కాగా, వచ్చే నెల 11న రక్షాబంధన్‌ను పురస్కరించుకుని ఈ యాత్ర ముగియనుంది. మరోవైపు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

Advertisement

Next Story

Most Viewed