- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'RRR'లో నా సీన్స్ అన్నీ కట్ చేశారు.. నాకు అన్యాయం జరిగింది.. యంగ్ హీరో సంచలన కామెంట్స్
దిశ, సినిమా: క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేసి నేడు హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకుంటున్న సత్యదేవ్(Sathyadev) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘బ్లఫ్ మాస్టర్’, ‘గాడ్ సే’, ‘తిమ్మరుసు’, ‘ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య’ లాంటి సినిమాలతో హీరోగా ఆకట్టుకున్నప్పటికీ సరైన కమర్షియల్ సక్సెస్‌ను మాత్రం అందుకోలేకపోయాడు. ఇక మెగాస్టార్ చిరంజీవికి పోటీగా తన విలనిజంతో 'గాడ్ ఫాదర్'(Godfather) అనే మూవీలో అదరగొట్టిన సత్యదేవ్.. త్వరలోనే 'జీబ్రా'(Zebra) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. వివరాల్లోకి వెళితే..
దర్శకధీరుడు రాజమౌళి(Rajamouli), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR), గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) కాంబోలో వచ్చిన పాన్ ఇండియా మూవీ 'RRR'లో హీరో సత్యదేవ్ కూడా నటించాడట. కానీ తన సీన్స్ అన్నీ ఎడిటింగ్‌లో తీసేశారని తాజా ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. ఆయన మాట్లాడుతూ.. “'RRR' సినిమా కోసం నేను దాదాపు 10 రోజుల పాటు పనిచేశాను. కానీ చివరకు వచ్చేసరికి నాకు సంబంధించిన దాదాపు 16 నిమిషాల సన్నివేశాలను ఎడిటింగ్లో తీసేశారు. అయితే మూవీ టీమ్‌పై ఉన్న గౌరవంతోనే నేను ఈ విషయాన్ని ఇప్పటిదాకా బయట ఎక్కడా చెప్పలేదు. కాకపోతే ఆ పదిరోజుల వర్క్ చేయడం మాత్రం మరిచిపోలేని అనుభూతి” అని తనకు జరిగిన అన్యాయాన్ని సత్యదేవ్ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈయన చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారగా.. దీనిపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
Read More..
NTR: కష్టాల నడుమనే ఎదగడం గొప్పదనం అని అమ్మ అనేది.. స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్