ఒకరు లైటర్‌, మరొకరు ఇంజెక్షన్‌‌.. పాపం ఆయన పరిస్థితేంటి?

by Mahesh |
ఒకరు లైటర్‌, మరొకరు ఇంజెక్షన్‌‌.. పాపం ఆయన పరిస్థితేంటి?
X

దిశ, సినిమా : బీటౌన్ బ్యూటీ అలియా‌భట్ కొత్త చిత్రం 'డార్లింగ్స్‌' కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాలో తను నటించడమే కాక నిర్మాతగానూ అరంగేట్రం చేస్తోంది. ఈ క్రమంలోనే విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగా.. ఇప్పుడు ట్రైలర్ విడుదలకు ముందు మరో కొత్త పోస్టర్‌తో ప్రేక్షకులను అలరించింది మూవీ యూనిట్. ఇందులో అలియా చేతిలో లైటర్‌తో దర్శనమివ్వగా.. షెఫాలీ షా పెద్ద సైజ్ ఇంజక్షన్ పట్టుకుని నిలబడి ఉంది. మరోవైపు గ్యాస్ బండపై చేతులు కట్టేసి కూర్చోబెట్టిన విజయ్ వర్మ వీళ్లద్దిరినీ చూస్తూ భయంతో వణికిపోవడాన్ని చూడొచ్చు. ఇక ఈ పోస్టర్‌ను నెట్టింట షేర్ చేసిన అలియా.. 'ఇస్ లైటర్ మే బాస్ ప్యార్ హై డార్లింగ్స్. కల్ ట్రైలర్ మే దేఖ్ లేనా' అంటూ క్యా్ప్షన్ ఇచ్చింది. కాగా ఈ మూవీ ఆగస్ట్ 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది.

Advertisement

Next Story