Akhanda 2 : విభూతి పెట్టుకుని తాండవానికి సిద్ధమవుతున్న బాలయ్య .. ‘అఖండ 2’ టైటిల్ థీమ్ రిలీజ్

by Prasanna |   ( Updated:2024-10-16 15:42:41.0  )
Akhanda 2 : విభూతి పెట్టుకుని తాండవానికి సిద్ధమవుతున్న బాలయ్య .. ‘అఖండ 2’ టైటిల్ థీమ్ రిలీజ్
X

దిశ, వెబ్ డెస్క్ : బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో సినిమా వస్తుందంటే అది పక్కా హిట్ అవ్వాల్సిందే. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన సింహ, లెజెండ్, అఖండ.. మూడు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ అయ్యాయి. ఆ మూడు సినిమాలతో తెలుగు సినీ ఇండస్ట్రీ లో హ్యాట్రిక్ హిట్ కొట్టి రికార్డు క్రియోట్ చేసారు.

అయితే, అఖండ మూవీ తర్వాత అఖండ 2 ఉంటుందని ప్రకటించారు. దసరా రోజు చెప్పినట్టే అఖండ 2 మూవీని ఈ రోజు అనౌన్స్ చేసారు. బాలయ్య – బోయపాటి కాంబోలో నాలుగో మూవీగా అఖండ 2 మూవీ రాబోతుంది. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ రామ్ ఆచంట – గోపీచంద్ ఆచంట నిర్మాతలుగా వ్యవహరించనున్నారు. తాజాగా, టైటిల్ ను ప్రకటిస్తూ మూవీకి సంబంధించిన పోస్టర్, టైటిల్ థీమ్ కూడా రిలీజ్ చేస్తూ ఓ వీడియోని షేర్ చేసారు.

ఈ టైటిల్ థీమ్ కి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అదిరిపోయే బీజీఎమ్ ను ఇచ్చాడు. అఖండ మూవీకి ఎలాంటి పాటలు ఇచ్చాడో మనకీ తెలిసిందే. ఇప్పుడు, అఖండ 2 టైటిల్ కి తాండవం అనే క్యాప్షన్ ఇచ్చారు. ఓ వైపు బాలయ్య విభూతి పెట్టుకుని తాండవానికి సిద్ధమవుతున్నాడు.. ఇంకో వైపు తమన్ ఇచ్చిన మ్యూజిక్ ప్రేక్షకులను కట్టిపడేసింది.

Advertisement

Next Story