- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఐశ్వర్య రాయ్, అభిషేక్ విడాకులు కన్ఫర్మ్.. నటితో ఎఫైర్ కారణమా?
దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాయ్(Aishwarya Rai) కెరీర్ పీక్స్‌లో ఉండగా అభిషేక్ బచ్చన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అమ్మడు ఏకంగా బిగ్ బి అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan)ఇంటికి కోడలిగా వెళ్లింది. ఐశ్వర్య(Aishwarya), అభిషేక్(Abhishek)కు ఆరాధ్య అనే కూతురు కూడా ఉంది. అయితే వీరిద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో విడాకులు తీసుకోబోతున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వీరు విడి విడిగా ఉంటున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.
విడాకులపై ఎన్ని వార్తలు వచ్చినప్పటికీ ఐశ్వర్య, అభిషేక్ మాత్రం స్పందించలేదు. దీంతో నిత్యం వీరి విడాకులకు సంబంధించి ఏదో ఒక వార్త నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంది. తాజాగా, ఐశ్వర్య, అభిషేక్ విడాకుల కన్ఫర్మ్ అయినట్లు ఓ వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అభిషేక్ బచ్చన్(Abhishek Bachchan) ఓ నటితో ఎఫైర్ పెట్టుకున్నట్లు అందుకే ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు రూమర్స్ వస్తున్నాయి. దానికి కారణం ఇటీవల అక్టోబర్ 11న జరిగిన అమితాబ్ బచ్చన్ పుట్టిన రోజు వేడుకలకు ఆమె హాజరైనట్లు తెలుస్తోంది.
ఇందులో ఐశ్వర్య(Aishwarya Rai) కనిపించకుండా.. అభిషేక్(Abhishek Bachchan) ప్రియురాలు ఉండటంతో అంతా విడాకులు కన్ఫర్మ్ అని చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఫొటోలు నెట్టింట వైరల్ కావడంతో మరోసారి ఐశ్యర్య విడాకుల వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుకే ఐశు మామ పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉందని అంటున్నారు. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఐశ్వర్య, అభిషేక్ విడాకులు వార్తలు మాత్రం నెట్టింట సంచలనం సృష్టిస్తున్నాయి.