భయపెడుతున్న యుగాంతం సెల్ఫీలు!

by srinivas |
భయపెడుతున్న యుగాంతం సెల్ఫీలు!
X

దిశ, ఫీచర్స్ : ప్రపంచం అంతరిస్తే ఎలా ఉంటుందోననే చర్చ తరుచూ తెరమీదకు వస్తూనే ఉంటుంది. కరోనా వైరస్ విరుచుకుపడినప్పుడు.. డూమ్స్ డే క్లాక్ అర్ధరాత్రికి చేరువవుతుందనే టాక్ వినిపించినప్పుడు.. వాతావరణం అనూహ్య మార్పులు సంభవించినప్పుడు.. యుగాంతం తప్పదని హెచ్చరిస్తుంటారు నిపుణులు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రపంచం అంతానికి ముందు భూమిపై 'చివరి సెల్ఫీ' ఎలా ఉంటుందనే దానిపై ఒక సంగ్రహావలోకనం ఇవ్వగా.. ఈ చిత్రాలు చూస్తే ఒళ్లు గగుర్పాటుకు గురవడం ఖాయం.

వాస్తవానికి భూమి చనిపోయే ముందు చివరి సెల్ఫీలు ఎలా ఉంటాయో ఊహించడం అసాధ్యం. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఇమేజ్ జనరేటర్ దీన్ని సాధ్యం చేయగా, అంతమయ్యేలోపు ప్రపంచంలోని చివరి చిత్రాల ఇంప్రెషన్స్ సృష్టించింది. ఈ మేరకు టిక్‌టాక్‌లో 'రోబో ఓవర్‌లోడ్స్' అకౌంట్ నుంచి హంటింగ్ సిరీస్ ద్వారా ఈ చిత్రాలు షేర్ చేశారు. గగుర్పాటు కలిగించే ఈ చిత్రాలను DALL-E 2 అనే ఏఐ ఇమేజ్ జనరేటర్ రూపొందించగా, ఈ భయానక చిత్రాల్లో మానవులు భారీ కళ్లు, పొడవైన వేళ్లతో వికృతంగా కనిపించారు. అన్ని చిత్రాల్లోనూ వికృతమైన రూపంలోని మానవులందరూ భారీ పేలుడు పదార్థం సంభవించినప్పుడు తమ ఫోన్ కెమెరాలను చూపిస్తున్నట్లున్నారు.

షార్ట్-వీడియో హోస్టింగ్ ప్లాట్‌ఫామ్‌ టిక్‌టాక్‌లో భాగస్వామ్యం చేసిన వీడియో ప్రకారం 'సెల్ఫీ ఆఫ్ ది వరల్డ్' ఎలా ఉంటుందో చూపించమని AI ఇమేజ్ జనరేటర్‌ని కోరగా.. సదరు జనరేటర్, DALL-E 2 ద్వారా రూపొందించిన చిత్రాలను చూపిస్తాయి. కొంతమంది నెటిజన్లు ఈ చిత్రాలను 'ఈరోజు చూసిన భయంకరమైన విషయం', 'భూమి సురక్షితంగా ఉంది.....ఇది వేరే గ్రహం కావచ్చు' 'బహుశా మనం అప్పటికి వేరే గ్రహం మీద జీవించేందుకు మార్గం కలిగి ఉండవచ్చు' అంటూ కామెంట్స్ చేయగా, మరికొందరు ప్రపంచమంతమయ్యే సమయంలో కెమెరా క్లారిటీ గురించి చర్చించడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed