పెళ్లి‌కి ముందు చివరి పార్టీ.. బెస్ట్ ఫ్రెండ్స్‌తో హీరోయిన్ చిల్

by samatah |   ( Updated:2022-04-08 08:04:00.0  )
పెళ్లి‌కి ముందు చివరి పార్టీ.. బెస్ట్ ఫ్రెండ్స్‌తో హీరోయిన్ చిల్
X

దిశ, సినిమా : బాలీవుడ్ స్టార్ కపుల్ ఆలియా, రణ్‌బీర్‌ నాలుగేళ్లుగా పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. కానీ పెళ్లి విషయాన్ని ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చిన ఈ లవ్ జంట.. ఎట్టకేలకు ఏప్రిల్ 17న ఒక్కటి కాబోతున్నారు. గత డిసెంబర్ నుంచి వీరి పెళ్లి వార్తలు వినిపించినప్పటికీ అవేవీ నిజం కాకపోవడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. కానీ ఇటీవలే 'ఆర్‌ఆర్‌ఆర్' మూవీతో భారీ విజయంతో జోష్‌లో ఉన్న ఆలియా పెళ్లిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వెలువడటంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతానికి పెళ్లి పనుల్లో బిజీగా ఉన్న ఆలియా.. పెళ్లికి ముందు తన బెస్ట్ ఫ్రెండ్స్ అనుష్క రంజన్, ఆకాన్ష రంజన్‌తో గ్రాండ్ పార్టీ సెలబ్రేట్ చేసుకునేందుకు ప్లాన్ చేసింది.

ఈ బ్యాచిలరేట్ పార్టీకి అర్జున్‌‌‌‌‌‌ కపూర్, ఆదిత్యా‌రాయ్‌ కపూర్, అయాన్‌ ముఖర్జీతో పాటు తన చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్‌ను కూడా పిలవనుందని సమాచారం. ఇక ముంబైలోని ఆర్‌కే స్టూడియోస్‌లో వీరి పెళ్లి జరగనుండగా.. రిసెప్షన్ వేడుకకు షారుఖ్ ఖాన్, దీపికా పదుకొనెకు ఆహ్వానం అందినట్లు టాక్. కాగా మ్యారేజ్ తర్వాత ఆలియా, రణ్‌బీర్.. హనీమూన్ కోసం స్విట్లర్లాండ్‌ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆలియా నెక్ట్స్ మూవీ షూటింగ్ అక్కడే జరగనుంది.

Advertisement

Next Story