ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సౌత్‌దే పై చేయి.. యంగ్ హీరో

by S Gopi |
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీల్లో సౌత్‌దే పై చేయి.. యంగ్ హీరో
X

దిశ, సినిమా : టాలీవుడ్ యంగ్ హీరో అడవిశేషు సౌత్ వర్సెస్ నార్త్ ఇష్యూపై తన అభిప్రాయం వెల్లడించాడు. 'ప్రేక్షకులు ఏ భాష సినిమాలు చూస్తారనేది వాళ్ల వ్యక్తిగత విషయం. కానీ, ఇండస్ట్రీలు మాత్రం కలసికట్టుగా పనిచేయాలి. ప్రతిభ ఉన్నవారిని తప్పకుండా ప్రోత్సహించాలి. భాష విషయంలో దక్షిణాది పరిశ్రమలకు కొంతవరకు లాభం ఉంది. సౌత్ ఇండస్ట్రీ మేకర్స్‌కు హిందీ తెలుసు. హిందీ ఫిల్మ్ మేకర్స్‌కు ప్రాంతీయ భాషలు తెలియవు. ఈ విషయంలో సౌత్‌దే పై చేయి. ప్రస్తుతం మనం ఇండియన్ ఇండస్ట్రీగా మారుతున్నందుకు సంతోషంగా ఉంది. అయితే సౌత్ నుంచి వెళ్లిన మహిళలు బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్స్‌గా ఎదినవాళ్లు లేరు. కానీ, నార్త్ నుంచి వచ్చి సౌత్‌లో స్టార్ హీరో, హీరోయిన్లుగా మారినవాళ్లున్నారు. ఇప్పటివరకూ దక్షిణాది నటులు నార్త్‌లో స్టార్ డమ్ సంపాదించిన దాఖలాలు లేవు. ఏది ఏమైనా ప్రస్తుతం ఆ హద్దులు చెరిగిపోతున్నందుకు హ్యాపీ' అంటూ వివరించాడు.

Advertisement

Next Story

Most Viewed