- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూసేకరణపై రైతులతో కలెక్టర్ సమావేశం
దిశ ప్రతినిధి, ఆదిలాబాద్: కాళేశ్వరం ప్రాజెక్ట్ లో భాగమైన లక్ష్మీ నర్సింహ స్వామి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ యొక్క భూసేకరణ పరిహారం నిమిత్తం మంగళవారం జిల్లా పాలనాధికారి సమావేశ మందిరంలో తహశీల్దార్లు, నీటిపారుదల శాఖ అధికారులతో జిల్లా పాలనాధికారి ముషారఫ్ ఫారూఖీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా సుమారు 50,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని దీనిలో ప్రధానంగా మూడు విభాగాలలో యూనిట్ 1, 2 ద్వారా 37 వేల ఎకరాలకు, యూనిట్ 3 లో భాగంగా మామడ కెనాల్ ద్వారా సుమారు 13 వేల ఎకరాల సాగునీరు అందుతుందని తెలిపారు.
ప్రస్తుతం మామడ కెనాల్ లో భూసేకరణ నిమిత్తం 19 కి.మి. మేర నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని, ఈ కాలువ ద్వారా చెరువులు నింపడం జరుగుతుందని తెలిపారు. ప్రస్తుతం ఈ భూసేకరణ ప్రతి గ్రామంలో 40 నుంచి 50 మీటర్ల వెడల్పు కాలువ నిర్మాణానికి తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. గతంలో జీవో 123 ద్వారా పరిహారం చెల్లించడం జరిగింది.. కానీ ప్రస్తుతం 2013 భూసేకరణ చట్టం అమలులో ఉన్నందున దాని ప్రకారం పరిహారం చెల్లించడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. తదుపరి సమావేశం త్వరలో నిర్ణయిస్తామని తెలిపారు. నిర్మల్ అర్బన్, నిర్మల్ రూరల్, లక్ష్మణచాంద, మామడ మండలాలకు చెందిన సుమారు 16 గ్రామ రైతులు హాజరయ్యారు.