- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలి
దిశ ప్రతినిధి, మేడ్చల్: విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని, ఈ విషయంలో ఆయా పాఠశాలలు విద్యార్థులకు ప్రత్యేక శిక్షణనిచ్చి ప్రోత్సహించాలని మేడ్చల్ జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు. శుక్రవారం 'మన ఊరు – మన చెట్లు 'అనే అంశంపై తెలంగాణ రాష్ట్ర సమగ్ర శిక్ష, తెలంగాణ సాహిత్య అకాడమీల సమన్వయంతో కథల పోటీ లను నిర్వహించారు. జిల్లాలో 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు వారికి నచ్చిన భాషలో మన ఊరు – మన చెట్లు అనే అంశంపై కథలు రాసేలా ఏర్పాట్లు చేశారు. జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, డీఈవో విజయ కుమారి తో కలిసి పలు స్కూళ్లలో పోటీలను పరిశీలించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు వివిధ సాంస్కృతిక, కళలు తదితర రంగాల్లో రాణించేలా ప్రతి పాఠశాలలో ప్రత్యేకంగా తరగతులు ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థుల మేధస్సుకు పదును పెట్టి వారిలో ఉన్న పోటీతత్వం, నైపుణ్యాన్ని ఆయా పోటీ కార్యక్రమాలు నిర్వహించడం వల్ల తెలుస్తోందన్నారు. విద్యార్థులు తాము రాసిన ప్రతి కథ ఎంతో విలువైందని అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రతి కథానికను ప్రతి పాఠశాలలో జాగ్రత్తగా భద్రపరచాలని అదేశించారు. పాఠశాలల్లో ఉన్నతమైన కథలను మండల విద్యాధికారుల ద్వారా జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపించాలని సూచించారు. జిల్లా విద్యాశాఖ నుంచి తెలంగాణ సాహిత్య అకాడమీకి జాగ్రత్తగా కథల ప్రతులను చేరవేయాలని డీఈఓ విజయ కుమారికి అదనపు కలెక్టర్ సూచించారు.