- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిలయన్స్ కేపిటల్‌ను కొనేందుకు అదానీ, పిరమల్ ఫైనాన్స్ కంపెనీల ఆసక్తి!
దిశ, వెబ్‌డెస్క్: అప్పుల ఊబిలో కూరుకుపోయిన ప్రముఖ వ్యాపారవేత్త అనిల్ అంబానీ ప్రమోటర్ సంస్థ రిలయన్స్ కేపిటల్ లిమిటెడ్(ఆర్‌సీఎల్)ను కొనుగోలు చేసేందుకు అదానీ ఫిన్‌సర్వ్, కేకేఆర్, పిరమల్ ఫైనాన్స్, పూనావాలా ఫైనాన్స్ సంస్థ 14 సంస్థలు ఆసక్తిని వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ఆర్‌బీఐ నియమించిన అడ్మినిస్ట్రేషన్ తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్న రిలయన్స్ కేపిటల్‌ను కొనేందుకు బిడ్‌లు సమర్పించేందుకు చివరి తేదీని మార్చి 11 నుంచి 25కు పొడిగించింది.
రుణాల చెల్లింపులు, గవర్నెన్స్‌లో లోపాలను సకాలంలో సరిదిద్దడంలో విఫలమైన రిలయన్స్ కేపిటల్ బోర్డును గతేడాది నవంబర్‌లో భారతీయ రిజర్వ్ బ్యాంక్(ఆర్‌బీఐ) రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ స్థానంలో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నాగేశ్వర్ రావును అడ్మినిస్ట్రేటర్‌గా నియమించింది. ఇటీవల ఈ సంస్థ దివాలా ప్రక్రియను అడ్మినిస్ట్రేటర్ ప్రారంభించారు. అంతేకాకుండా దివాలా కోడ్ కింద ఆర్‌బీఐ దివాలా ప్రక్రియను ప్రారంభించిన మూడో అతిపెద్ద నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ) ఇదే కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో రిలయన్స్ కేపిటల్ సంస్థను కొనేందుకు ఆసక్తి వ్యక్తీకరణ సమర్పించేందుకు మరింత సమయం కావాలని కొందరు బిడ్డర్లు కోరడంతో దీన్ని ఈ నెల 25కి పొడిగించారని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగా, గతేడాది సెప్టెంబర్‌లో కంపెనీ నిర్వహించిన వార్షిక సాధారణ సమావేశంలో మొత్తం రుణాలు రూ. 40 వేల కోట్లు అని వాటాదారులకు తెలియజేసింది.