- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ పాత్రలు చాలా ఒత్తిడికి గురిచేస్తాయి.. సాయి పల్లవి
దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ సాయి పల్లవి తన నటన జీవితంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. నటిగా తనకెలాంటి పాత్రలు ఒత్తిడిగా అనిపిస్తాయో తెలిపింది. అలాగే ప్రస్తుతం తెరకెక్కించే పాత్రలతో పోల్చితే గతంలో క్రియేట్ చేసిన పాత్రలే ఎక్కువ సౌకర్యవంతంగా అనిపిస్తుంటాయన్న సాయి పల్లవి.. 'వర్తమాన సమాజంలో పోషించే పాత్రల కన్నా.. గతానికి సంబంధించిన క్యారెక్టర్లే మనసుకు నిండుగా అనిపిస్తాయి.
రోజు వారీ జీవితాల్లో కనిపించే పాత్రలు చేయాల్సి వచ్చినప్పుడు వాటిని ఎంత విభిన్నంగా చేయాలి అని చాలా ఆలోచిస్తుంటాం. అది వ్యక్తిగతంగా మనపై ఓ తెలియని ఒత్తిడిని కలిగిస్తుంటుంది. అదే మనకు పరిచయం లేని కాలానికి సంబంధించిన పాత్రలు పోషిస్తున్నప్పుడు వాటిని ఎలా చేయాలన్న విషయంలో కాస్త స్వేచ్ఛ ఉంటుంది. కథలో పాత్రను తీర్చిదిద్దిన విధానాన్ని బట్టి ఆ ప్రపంచం ఎలా ఉంటుంది? ఆ సమయంలో ఆ పాత్ర ఆలోచనా విధానం ఎలా ఉంటుంది? అనే విషయాన్ని ఊహించుకుంటూ దాన్ని మనదైన శైలిలో చూపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అలాంటి పాత్రలే తేలికగా అనిపిస్తాయి' అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది.