తండ్రి దహన సంస్కారాలు చేసిన నటి.. వీడియో వైరల్

by Disha Desk |
తండ్రి దహన సంస్కారాలు చేసిన నటి.. వీడియో వైరల్
X

దిశ, సినిమా: బాలీవుడ్ హీరోయిన్ రవీనా టాండన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ రచయిత, డైరెక్టర్, నిర్మాతగా గొప్ప పేరు సంపాదించిన ఆమె తండ్రి రవి టాండన్ ముంబైలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఎనభై ఆరేళ్ల వయసున్న ఆయన గత కొద్దికాలంగా శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తుండగా.. ఈ మరణవార్త విన్న బాలీవుడ్ ఇండస్ట్రీతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆయన ఫ్యాన్స్ ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని నివాళి అర్పిస్తున్నారు. అయితే తన తండ్రి దహన సంస్కారాలను రవీనా టాండన్ నిర్వహించడం విశేషం. కాగా ఇందుకు సంబంధించిన వీడియో, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

https://www.instagram.com/tv/CZ1btXBAzJg/?utm_source=ig_web_copy_link

https://www.instagram.com/p/CZ1fFDBtGCJ/?utm_source=ig_web_copy_link

Advertisement

Next Story

Most Viewed