అమిత్ షాపై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్.. ట్వీట్ వైరల్

by Manoj |
అమిత్ షాపై నటుడు ప్రకాష్ రాజ్ ఫైర్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: పార్లమెంటరీ బిజినెస్ లాంగ్వేజ్ కమిటీ 37వ సమావేశం.. ఆ కమిటీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన అమిత్ షా హిందీ భాషా చరిత్ర, దాని అభివృద్ధి గురించి పూర్తిగా వివరించారు. ఇదే క్రమంలో వివిధ రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఒకరితో ఒకరు హిందీలో సంభాషించుకోవాలని, ఆంగ్ల భాషకు ప్రత్యామ్నాయంగా హిందీని పరిగణించాలని అమిత్ షా సూచించారు. అమిత్ షా వ్యాఖ్యలకు నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా స్పందించారు.

షా ప్రకటనతో కూడిన మీడియా ఆర్టికల్‌ను జోడించి ఇలా అన్నారు.. 'హోమ్ మంత్రి గారు ఒకే కుంటుంబంలా ఉంటున్న ప్రజలను భాష పేరుతో వేరు చేయకండి. దేశంలో హిందీని అమలు చేయాలన్న మీ ఆలోచనను ఎదిరించడానికైనా మేము సిద్ధం. మాకు మా మాతృభాష, మా గుర్తింపు అంటే ఎంతో ప్రేమ ఉంది. దాన్ని కించపరిచేందుకు ప్రయత్నించొద్దు' అని ప్రకాష్ రాజ్ తన ట్వీట్‌లొ రాసుకొచ్చాడు. అంతకుముందు సంగీత స్వరకర్త, దర్శకుడు A R రెహమాన్ కూడా ఈ విషయమై స్పందించారు.

Advertisement

Next Story