IIFA Awards: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డ్స్ వస్తాయి.. ఐఫా అవార్డ్స్‌పై నటుడు సంచలన కామెంట్స్

by sudharani |
IIFA Awards: ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డ్స్ వస్తాయి.. ఐఫా అవార్డ్స్‌పై నటుడు సంచలన కామెంట్స్
X

దిశ, సినిమా: ఫ్యామిలీ (family) హీరోగా టాలీవుడ్ (Tollywood) ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు జగపతిబాబు (Jagapatibabu). తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి.. ప్రజెంట్ విలన్ పాత్రల్లో నటిస్తూ దుమ్మురేపుతున్నాడు. ఈ క్రమంలోనే భాషతో సంబంధం లేకుండా తెలుగులోనే కాకుండా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ సినిమాల్లో నటిస్తూ విలన్‌గా మంచి క్రేజ్ తెచ్చుకుని దూసుకుపోతున్నాడు. ఇందులో భాగంగా.. జగపతి బాబు విలన్‌గా నటించిన ‘దర్శన్ కాటేరా’ సినిమా కన్నడ నాట సూపర్ హిట్‌గా నిలిచింది.

ఈ నేపథ్యంలోనే కొద్ది రోజుల క్రితం దుబాయ్ (Dubai) లో జరిగిన ఐఫా 2024 అవార్డు (IIFA Awards-2024)ల వేడుక కార్యక్రమంలోనే జగ్గుబాయ్‌కు బెస్ట్ విలన్ (villain) అవార్డ్ (award) వచ్చింది. దీనిపై స్పందించిన జగపతి బాబు.. ‘ఎంత ఎదవలాగా చేస్తే అన్ని అవార్డులు వస్తాయి’ అనే క్యాప్షన్ (caption) ఇచ్చి.. అవార్డుకు సంబంధించిన వీడియో షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ‘అవార్డుల మీద ఆయనకు సరైన అభిప్రాయం లేకపోవడంతోనే అలా కామెంట్ చేసి ఉంటాడు’ అంటూ నెగిటివ్ కామెంట్స్ (Negative Comments) పెడుతున్నారు నెటిజన్లు.

Advertisement

Next Story

Most Viewed