- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలి: టీఆర్ఎస్ నేతలు
దిశ, పెద్డపల్లి: ప్రజాప్రతినిధులను, అధికారులను దూషిస్తూ వారి పరువుకు భంగం కలిగిస్తున్న చింతపండు నవీన్ (తీన్మార్ మల్లన్న)పై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ నాయకులు పెద్దపల్లి అమరవీరుల స్తూపం వద్ద నిరసనకు దిగి.. మల్లన్నకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం పెద్దపల్లి డీసీపీ రవీందర్‌ను కలిసి మీడియాను అడ్డం పెట్టుకుని పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, ఎస్సై రాజేష్‌లను దూషిస్తూ వారి పరువుకు తీన్మార్ మల్లన్న భంగం కలిగించారని వివరించారు. ఈ విషయంపై విచారణ జరిపి చింతపండు నవీన్‌పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని కోరారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. అక్కా, చెల్లెళ్ల మధ్య జరిగిన భూ వివాదంలో ప్రజాప్రతినిధులను, అధికారులను దూషించడం సిగ్గుచేటన్నారు. భూమి వివాదం కోర్టులో ఉన్న సమయంలో పోలీసులు, ప్రజాప్రతినిధులు ఏం చేస్తారని ప్రశ్నించారు. బ్లాక్ మెయిలర్ మల్లన్న బేషరతుగా ఎమ్మెల్యేతో పాటు ఎస్ఐకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు కాశి పాక వాసు, వెన్నం రవీందర్, బొంకురి నిఖిల్, తాళ్ల కళ్యాణ్, కొంకటి లింగమూర్తి, బొంకురి అఖిల్, మహేష్, మనికంట, శ్రీను, హరీష్, చిన్ను, జునెర్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.