Raghav Chadha: మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పొలిటీషియన్ ఇతనే!

by Javid Pasha |   ( Updated:2022-07-07 07:07:47.0  )
AAPs Most Eligible bachelor Raghav Chadha Reacts to Bhagwant Mann Second Marriage
X

దిశ, వెబ్‌డెస్క్: AAP's Most Eligible bachelor Raghav Chadha Reacts to Bhagwant Mann Second Marriage| ప్రస్తుతం పంజాబ్ సీఎం భగవంత్ మన్ రెండో వివాహం వ్యవహారం దేశమంతా హాట్ టాపిక్‌గా మారింది. ఈ సందర్భంగా ఓ జర్నలిస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీ నేత, జల్‌దల్ బోర్డు వైస్ చైర్మన్, పంజాబ్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్ధాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పార్టీలో రాఘవ్ చద్ధానే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటూ వ్యాఖ్యానించారు. ఈ జర్నలిస్ట్ వ్యాఖ్యలు కాస్త వైరల్ కావడంతో రాఘవ్ చద్ధా వీటిపై స్పందించారు. పెద్దల తర్వాత చిన్న వాళ్లకు ఛాన్స్ వస్తుందని చద్ధా అన్నారు. అంతేకాకుండా 'నా వడ్డే వీర్ మన్ సాబ్, దాక్టర్ గెర్‌ప్రీత్ కౌర్‌ సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కలిగి ఉండాలని కోరుకుంటున్నాను' అని రాసుకొచ్చారు. అయితే, జర్నలిస్ట్ వ్యాఖ్యలకు చద్ధా ఇచ్చిన రిప్లై నెట్టింట తెగ వైరల్ అవుతుంది.

Advertisement

Next Story

Most Viewed