ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో కూతురు.. సినిమాల్లోకి రావడం లేదంటూ

by Javid Pasha |   ( Updated:2022-03-06 18:00:20.0  )
ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన స్టార్ హీరో కూతురు.. సినిమాల్లోకి రావడం లేదంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ హీరో అమీర్‌ఖాన్ కుతురు ఐరా ఖాన్ నిరంతరం సోషలో మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ప్రశ్నలు, సమాధానాలంటూ ఓ సెషన్ నిర్వహించిన ఐరా.. మానసిక ఆరోగ్య సమస్యలు, భవిష్యత్తు ప్రణాళికలు తదితర అంశాల గురించి చెప్పుకొచ్చింది. అయితే ఒక అభిమాని ​బాలీవుడ్‌లోకి ఎప్పుడు అడుగుపెడుతున్నారు. హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తారా? లేక ఇంకేదైనా? అంటూ ప్రశ్నించాడు. ఈ ప్రశ్నలకు సమాధానాలిచ్చిన ఐరా.. 'నేను సినిమాల్లోకి రావడం లేదు. అలాంటి ఆలోచన ఇంతవరకు చేయలేదు. యాక్టింగ్ చేయాలనే కోరిక కూడా లేదు' అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో కాస్త నిరాశకు గురైన ఫ్యాన్స్.. దీన్ని బట్టి చూస్తే ఐరా నటి​కాకుండా డైరెక్టర్‌గా మారే అవకాశాలున్నట్లు తెలుస్తోందంటున్నారు.

Advertisement

Next Story