Ira Khan: అమీర్ ఖాన్ కూతురి పెళ్లి.. ఎప్పుడంటే..?

by Nagaya |   ( Updated:2022-07-20 10:02:12.0  )
Aamir Khans Daughter Ira Khan Getting married to her Boyfriend Nupur Shikhare
X

దిశ, సినిమా : Aamir Khan's Daughter Ira Khan Getting married to her Boyfriend Nupur Shikhare| మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ కూతురు ఐరా ఖాన్ పెళ్లిపై ప్రచారం జరుగుతోంది. ఈ ఇండస్ట్రీ సెన్సేషన్ గర్ల్.. తాజాగా గ్రాండ్ మదర్ జీనత్ హుస్సేన్‌, బాయ్‌ఫ్రెండ్ నుపూర్ శిఖారేతో కలిసిఉన్న ఫొటోలు పోస్ట్ చేయడం ఈ రూమర్స్‌కు కారణమైంది. నానమ్మతో కలిసి బాయ్‌ఫ్రెండ్‌ను మీట్ అయిందంటే.. 'మ్యారేజ్ ప్లాన్ చేసినట్లేనా?' అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్స్. 'షాపింగ్ మొదలెట్టారా? డెస్టినేషన్ వెడ్డింగ్ ట్రై చేస్తున్నారా?' అని అడుగుతున్నారు. కాగా రెండేళ్లుగా డేటింగ్‌లో ఉన్న ఐరా-నుపూర్ జంటకు అమీర్ ఖాన్ సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. ఐరా ఇప్పటికే డిప్రెషన్, యాంగ్జయిటీ గురించి ఫాలోవర్స్‌తో చర్చించి.. ఫేవరెట్ లేడీగా మారిపోయింది.

ఇది కూడా చదవండి: ఆ హీరోయిన్‌ తమ్ముడితో ఇలియానా డేటింగ్‌!

Advertisement

Next Story