- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పండగ వేళ విషాదం.. తోటి మిత్రులతో గోదావరికి వెళ్లి యువకుడి మృతి
దిశ, ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండలం మల్లురూ గ్రామానికి చెందిన రావుల కార్తీక్(22) గోదావరిలో పడి మృతి చెందాడు. ఎస్ఐ తాహెర్ బాబా తెలిపిన వివరాల ప్రకారం.. కార్తీక్ హోలి పండగ సందర్భంగా తన తోటి మిత్రులతో సమీపాన ఉన్న గోదావరికి వెళ్లి స్నేహితులతో రంగులు పుసుకున్నారు. అనంతరంపుసుకున్న రంగులతో గోదావరిలో పుణ్య స్నానం అచారించారు. కాగా తోటి స్నేహితులతో గోదావరిలో పుణ్య స్నానానికి దిగిన కార్తీక్ వరద తాకిడికి నదిలో మునిగాడు. తోటి స్నేహితులు కార్తీక్ ను కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ వరద ఉధృతి ఎక్కువ కావడంతో కార్తీక్ గోదావరిలో కనిపించకుండా పోయాడు.
ఈ విషయాన్ని గమనించిన తోటి స్నేహితులు కార్తీక్ బందువులకు సమాచారం అందించారు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులు గోదావరి తీరంలో కార్తీక్ ఆచూకీ కోసం వెతికినప్పటికిని సుమారు మధ్యాహ్నం వరకు కానరాలేదు. ఈ విషయం తెలిసిన ఎస్ఐ తాహెర్ బాబా నేతృత్వంలో కార్తీక్ కోసం గోదావరిలో గాలింపు చర్యలు చేపట్టి గోదావరిలో మునిగిన కార్తీక్ మృతదేహన్ని సిబ్బంది సహయంతో వెలికి తీశారు. కాగా మృతుడి తల్లీదండ్రుల పోలీసులకి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.