యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూసి.. అనుకున్న పని చేశాడు.. కానీ చివరకు!

by Satheesh |
యూట్యూబ్‌లో ఆ వీడియోలు చూసి.. అనుకున్న పని చేశాడు.. కానీ చివరకు!
X

దిశ, వెబ్‌డెస్క్: మొబైల్ ఫోన్ల వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో.. అంతకుమించి నష్టాలు ఉన్నాయి. యువత ప్రస్తుతం సమాజంలో ఫోన్ల వల్ల ఎన్నో చెడు అలవాట్లుకు బానిసలు అవుతున్నారు. సైబర్ క్రైమ్స్, ఆన్ లైన్ బెట్టింగ్స్.. ఇలాంటి వ్యసనాలకు బానిసలై.. జీవితాల్ని నాశనం చేసుకుంటుకున్నారు. మరి కొందరు మొబైల్ గేమ్స్‌కు అలవాటు పడి ప్రాణాలు వదులుతున్నారు. ఇంకొందరు సోషల్ మీడియాను ఆయుధంగా చేసుకుని అనైతిక చర్యలకు పాల్పడి కటకటాల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి గుంటూరులో జరిగింది.

వివరాల ప్రకారం.. గుంటూరుకు చెందిన ఓ యువకుడు ఐటీఐ చేశాడు. ఖాళీగా ఉంటున్న అతడు.. ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలనుకున్నాడు. ఈజీగా ఒకేసారి డబ్బు సంపాదించాలంటే బ్యాంకులలో దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా.. దీనికి సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో చూశాడు. ప్లాన్ ప్రకారం.. మార్చి 30వ తేదీన అర్ధరాత్రి ఫిరంగిపురంలోని ఎస్‌బీఐ బ్యాంకుకు వెళ్లాడు. వీడియోలలో చూసిన విధంగా మొదట బ్యాంకులోని అలారం వైర్లు కట్ చేశాడు. తర్వాత కిటికి గ్రిల్స్ తొలగించాడు.

లోపలికి వెళ్లి.. స్ట్రాంగ్ రూంలోని లాకర్ తాళాలు కట్టర్ ద్వారా తెరవడానికి విశ్వప్రయత్నం చేశాడు. అయితే, ఇక్కడే అతడికి చిక్కు వచ్చింది. బ్యాంక్‌లో అలారం వైర్లు కట్ చేసిన.. ఆ లాకర్ బ్యాంక్ మేనేజర్ ఫోన్‌కు కనెక్ట్ అయి ఉంది. మేనేజర్ ఫోన్‌లో అలారం మోగగానే వెంటనే సిబ్బందిని అప్రమత్తం చేశాడు. బ్యాంక్ దగ్గరికి సిబ్బంది వెళ్లగానే.. వారి రాకను గమనించిన యువకుడు అక్కడి నుంచి పరారయ్యాడు. సిబ్బంది ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు తీవ్రంగా గాలించి నిందితుడ్ని అరెస్ట్ చేసి.. కటకటాల్లోకి నెట్టారు.

Advertisement

Next Story

Most Viewed