విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన బైక్.. యువకుడి దుర్మరణం

by Web Desk |
విద్యుత్ స్తంభాన్ని ఢీ కొట్టిన బైక్.. యువకుడి దుర్మరణం
X

దిశ, కొండపాక: బైక్ వేగం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దర్గా గ్రామానికి చెందిన పొలబోయిన రమేష్ (29) ద్విచక్ర వాహనంతో రోడ్డు కు అనుకుని ఉన్న విద్యుత్ స్తంభానికి డీ కొట్టాడు. దీంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇటివలే రమేష్ దంపతులకు కూతురు జన్మించింది. రేపు కూతురు నామకరణం ఉండగా పక్క గ్రామం అయిన బందారం గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లి వస్తున్నాడు. ఈ క్రమంలోనే బైక్ వేగం అదుపుతప్పి విద్యుత్ స్తంభానికి ఢీ కొట్టి అక్కడికక్కడే మరణించారు.

Advertisement

Next Story