- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీశ్ రావుకు మహిళ లేఖ.. వైరల్గా మారిన ఆమె మాటలు
దిశ, తెలంగాణ బ్యూరో : "రాజన్న సిరిసిల్ల జిల్లా చింతల్ ఠాణా ఆర్ అండ్ ఆర్ కాలనీకి చెందిన పోచయ బిడ్డ పురిటి నొప్పులతో బాధపడుతుంటే సిరిసిల్ల ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీకి తీసుకెళ్లాడు.. వైద్యులకు చూపించారు.. వారు ఎలాంటి ఇబ్బంది లేదు కొంచెం ఓపిక పట్టు సాధారణ కాన్పు చేద్దాం అనడంతో.. మంత్రి హరీష్ రావు సర్ టీవీల్లో చెప్పిన మాట విని సాధారణ కాన్పుకు సిద్ధం అయ్యాడు.. ఓపిక పట్టి సాధారణ కాన్పు చేపించాడు.. పండంటి మగబిడ్డ పుట్టాడు.. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు.. ఈ సంతోషంలో మంత్రి హరీష్ రావుకు పోచయ్య , ఆయన బిడ్డ వసంత పోస్ట్ కార్డు ద్వారా ఉత్తరం రాసి పంపారు. ఏమని రాశారంటే..
"సారు.. మాది రాజన్న సిరిసిల్ల జిల్లా. కేసీఆర్ సర్ వలన మంచిగ వసతులు ఉన్నాయని సిరిసిల్ల సర్కారు దవాఖానకు తీసుక పోయిన. మా కేటీఆర్ సారు కూడా ఆసుపత్రిని బాగా చేసాడు. బాగా నొప్పులతో ఆసుపత్రికి వెళ్లినం. అక్కడ డాక్టర్ లు మంచిగ చూసి ఓపిక పట్టు సాధారణ కాన్పు చేపించుకో అన్నారు.. మీరు( హరీశ్ రావు) టీవీల్లో చెపుతారు కదా.. సాధారణ కాన్పులు గురించి అని అలానే చేపించిన. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పు వల్ల పైసా ఖర్చు లేదు.. పైగా కేసీఆర్ కిట్ ఇచ్చిర్రు.. పైసా తీసుకోకుండా అమ్మ ఒడి వాహనంలో ఇంట్లో దింపిండ్రు.. కడుపుకోతలు నివారించేందుకు మీరు పడుతున్న కష్టం చూసి నాకు, బిడ్డకు, మనవడికి కలిగిన మేలు అందరికి తెలవాలన్న ఉద్దేశ్యంతో మీకు కృతజ్ఞతలు తెలుపుతూ ఈ లేఖ రాయించి పంపుతున్నాను సార్..'' అంటూ.. " సర్కారు దవాఖానలో సకల సౌలత్ లు ఉన్నాయ్.. ! కాన్పులకు ప్రభుత్వ ఆసుపత్రికె రావాలి.. !! నాకు జరిగిన మేలు అందరికి జరగాలని ఆ లేఖలో పేర్కొన్నారు..
కాగా, ఈ ఉత్తరాన్ని చూసిన మంత్రి హరీశ్ రావు సంతోషం వ్యక్తం చేశారు. ఈ ఉత్తరం సాధారణ కాన్పులకు చైతన్యం... నూరు వసంతాలు వసంత వర్ధిల్లాలి అంటూ హరీశ్ రావు వ్యాఖ్యనించారు. ఈ ఉత్తరం మహిళలో, ప్రజల్లో గొప్ప చైతన్యం స్పూర్తిని ఇస్తుందన్నారు.