- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జీవితంలో పడరాని పాట్లు పడిన మహిళ.. మొత్తానికి వ్యాపారం ప్రారంభించి..
దిశ, ఫీచర్స్ : కర్ణాటక రాష్ట్రం ఉత్తర కన్నడ జిల్లా హస్విగులి గ్రామానికి చెందిన దంపతులు కమల- వెంకట రమణా నాయక్‌కు ఇద్దరు పిల్లలు. ఇన్నాళ్లు కడుపు నిండ తిండి తినలేని కష్టాల ఊబిలో కూరుకుపోయిన ఆ కుటుంబం.. అద్భుతమైన ఆలోచనతో ఆ బాధల నుంచి విముక్తి పొందింది. ఇతరులకు ఆదర్శప్రాయంగా నిలుస్తోంది.
రోజూవారి పోరాటం
హస్విగులి గ్రామానికి చెందిన కమల, నాయక్ దంపతులు ఉన్న అర ఎకరం భూమిలోనే వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. ఇది సరిపోక కూలీ పనులు చేసి పొదుపు చేద్దామనుకున్నా కుటుంబ అవసరాలు తీరక అప్పులే మిగిలేవి. స్థానిక మహిళలతో కలిసి అరెక కాయల గింజలు తీసేందుకు వెళ్లేది. పంట సీజన్‌లో రోజుకు రూ. 100 కూలీ డబ్బులొచ్చినా... మిగిలిన రోజులు మాత్రం కష్టాలు తప్పేవి కావు. కుటుంబ పరిస్థితి రోజురోజుకు దిగజారుతుండటంతో పెద్ద కొడుకు చదువు మానేశాడు. దీంతో జీవితంపై విసుగుచెందిన కమల.. ఆదాయాన్ని పెంచే మార్గాన్ని కనుగొనాలనుకుంది. సరికొత్త దారిలో ప్రయాణించి కుటుంబాన్ని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేయాలనుకుంది. ఈ క్రమంలోనే జ్ఞాన జ్యోతి స్వసహాయ సంఘ, స్వయం సహాయక సంఘం, మనువికాస అనే స్వచ్ఛంద సంస్థ సహకారంతో సొంతంగా వ్యాపారం చేసేందుకు రూ.40 వేలు అప్పు తీసుకుని పౌల్ట్రీ బిజినెస్ ప్రారంభించింది.
ఫౌల్ట్రీ బిజినెస్ ప్రారంభం
బిజినెస్‌తో పాటు ఇంటి పనికి టైం కేటాయించిన కమల.. ఒక్కొక్క కోడి పిల్లకు రూ.60 చొప్పున దాదాపు 75 కోడిపిల్లలను కొనుగోలు చేసింది. పెద్ద ఫౌల్ట్రీ ఫామ్‌ల మాదిరిగా కాకుండా దేశవాళీ కోళ్లను పెంచేందుకు అవసరమయ్యే ఫామ్‌ని ఏర్పాటు చేసింది. దీంతో తన ఫామ్‌లో ఫైటర్, గిరిరాజా, కడక్‌నాథ్‌తో పాటు ఇతర జాతులను కూడా కలిగి ఉంది.
రుణం పొందడంతో.. కలిసొచ్చిన అదృష్టం..
ఈ బిజినెస్‌తో కమల పెద్దగా పెరిగిన 100-150 కోళ్లను రూ. 400-500 వరకు విక్రయించడం ప్రారంభించింది. దీంతో పాటు దేశీ కోడి గుడ్లను అమ్మడం ద్వారా కొంత అదనపు ఆదాయాన్ని పొందింది. కొద్దికాలంలోనే పౌల్ట్రీ బిజినెస్‌కు మంచి స్పందన రావడంతో.. కస్టమర్స్ క్యూ కడుతున్నారు. ముఖ్యంగా పండుగల సీజన్‌లో పౌల్ట్రీకి డిమాండ్ ఎక్కువగా ఉంటుండగా.. కస్టమర్లు 15 రోజుల ముందుగానే ఆర్డర్‌లు ఇస్తారని తెలిపింది కమల. అంతేకాకుండా పార్టీలు చేసుకునేందుకు కొనుగోలు చేసే యూత్ ఈ కోళ్లకు అత్యధిక రేటు చెల్లిస్తారని పేర్కొంది.
సంపాదన
కోడిపిల్లల కొనుగోలు, దాణా, ధాన్యం కొనుగోలు, రుణం చెల్లించడం, ఇతర గృహ అవసరాలు తీర్చడం వంటి అన్ని ఖర్చులు పూర్తయిన తర్వాత.. కమల నెలకు రూ. 5,000 సంపాదిస్తుంది. ఇక ఈ ఐదువేలు అనేది చాలా మందికి పెద్ద మొత్తంగా అనిపించక పోయినప్పటికీ, బతుకుదెరువు కోసం కష్టపడుతున్న కమల కుటుంబ సభ్యుల జీవితంలో మాత్రం భారీ మార్పు అనే చెప్పాలి. అంతేకాదు అప్పుగా రూ. 40వేలు తీసుకున్న కమల.. ఇప్పటికే రూ. 34వేలు తిరిగి చెల్లించగలిగింది. ఇప్పుడు పెరుగుతున్న కస్టమర్ల అవసరాలు తీర్చేందుకు తన ఫౌల్ట్రీ పరిమాణాన్ని పెంచడంపై దృష్టి పెట్టింది. ఇక ఇప్పటి వరకు కమల సాధించగలిగిన విజయం మిగతా మహిళలకు మరింత ఆత్మవిశ్వాసాన్ని కలిగించింది.
మహిళా పారిశ్రామికవేత్తలను ఎందుకు జరుపుకోవాలి?
మనువికాస వంటి స్వచ్ఛంద సంస్థలకు మద్దతిచ్చిన ఎడెల్‌గివ్ ఫౌండేషన్ సీఈఓ నగ్మా ముల్లా.. కమల సాధించిన విజయాన్ని ప్రశంసించారు. ఇలాంటి సక్సెస్‌ను సెలబ్రేట్ చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. 'మహిళలు తమ సంస్థలను స్థాపించడంలో ప్రయాణం ఇతరులతో పోలిస్తే పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఒక మహిళా పారిశ్రామికవేత్త విజయం.. కుటుంబం, జీవిత భాగస్వామి నుంచి పొందే మద్దతు మీద కూడా ఆధారపడి ఉంటుంది' అని పేర్కొన్నారు.