చిప్స్ తినే బతికేస్తోంది.. 22 ఏళ్లుగా అదొక్కటే డైలీ ఫుడ్

by Javid Pasha |   ( Updated:2022-03-11 06:39:26.0  )
చిప్స్ తినే బతికేస్తోంది.. 22 ఏళ్లుగా అదొక్కటే డైలీ ఫుడ్
X

దిశ, ఫీచర్స్ : 22 ఏళ్లుగా ఓ మహిళ కేవలం చిప్స్ తింటూ బతికేస్తోంది. ప్రస్తుతం 25 ఏళ్ల వయసున్న ఆమె.. ఇప్పటి వరకు కూరగాయలు, పండ్లను ఆహారంగా తీసుకోలేదని చెప్తోంది. అవాయిడెంట్ రిస్ట్రిక్టివ్ ఫుడ్ ఇన్‌టేక్ డిజార్డర్(ARFID)తో బాధపడుతున్న సమ్మర్ మోన్రో.. మూడేళ్ల వయసు నుంచే ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అవాయిడ్ చేస్తున్నట్లు తెలిపింది. ఉడికించిన బంగాళదుంపను తినమని ఒత్తిడి చేసినప్పటి నుంచి సమ్మర్‌లో ఈ డిజార్డర్ మొదలైంది. అప్పటి నుంచి 'బర్డ్స్ ఐ' కంపెనీకి చెందిన చికెన్ నగెట్స్(చిప్స్), వాల్కార్స్ క్రిస్ప్స్ కంపెనీకి చెందిన చిప్స్ మాత్రమే తింటోంది.

కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్‌గా పనిచేస్తున్న సమ్మర్.. క్రిస్పీ ఫుడ్(చిప్స్) కాకుండా వేరే ఏదైనా ట్రై చేస్తే నోట మాట రాదు. ఆహారం పెదాలకు తాకితే చాలు ఆమెకు ఇరిటేషన్ వస్తుంది. ఒకసారి యాపిల్ తినేందుకు ప్రయత్నిస్తేనే.. ఫిజికల్‌గా సిక్ అయిపోయినట్లు సమ్మర్ తెలిపింది. ఫుడ్ స్మెల్ తనను టెంప్ట్ చేసినప్పటికీ.. తింటే మాత్రం ఆస్పత్రి పాలవడం ఖాయమని బాధపడుతోంది. ఈ డిజార్డర్‌ నుంచి బయటపడేందుకు ఎన్ని థెరపీలు ట్రై చేసినా ఫలితం లేకపోయిందన్న సమ్మర్.. ఈ రిస్ట్రిక్టెడ్ ఫుడ్ హ్యాబిట్స్‌ తనను శారీరకంగా నష్టపరచకపోవడం మాత్రం ఆనందంగా ఉందని వెల్లడించింది. ఇక తన డిజార్డర్‌ గురించి తెలిసిన బాయ్ ఫ్రెండ్ ఎంతో సపోర్ట్ చేశాడని.. మరోవైపు ఎప్పుడూ ఉల్లాసంగా, పూర్తి ఆరోగ్యంతో ఉండే తనను చూసి ఫ్రెండ్స్ కూడా ఆశ్చర్యపోతారని చెప్పింది.



Advertisement

Next Story