- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
శోభనం రోజు రాత్రి భర్తకు మత్తు మందు.. లేచిన తర్వాత షాక్‌లో భర్త
దిశ, వెబ్‌డెస్క్: ఓ యువతి చాలా అందంగా ఉంటుంది. ఆమె అందమే ఆమెకు అత్యాశను కలిగించింది. దీనితో ఆ మహిళ కొందరితో కలిసి ఓ ముఠాగా ఏర్పాడి.. యువకులను మోసం చేస్తుండగా పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం.. హర్యానాలో ఓ మహిళ పెళ్లికాని యువకుల్ని.. రెండవ పెళ్లి చేసుకోవాలనుకునే మగవారిని టార్గెట్ చేస్తుంది. స్నేహం పేరుతో మెళ్లగా వారికి దగ్గర అవుతుంది. ఆ పరిచయాన్ని కాస్త పెళ్లి వరకు తీసుకెళ్తుంది. నాకు తల్లిదండ్రులు ఎవరు లేరని.. అనాథనని వారిని నమ్మిస్తుంది. దీనికి ఆమె ముఠా సభ్యులు కూడా సహయం చేస్తారు.
ఇక యువకుల్ని నమ్మించిన తర్వాత.. పెళ్లి చేసుకుంటుంది. ఇక ఫస్ట్ నైట్ రోజు భర్తకు మత్తుమందు ఇచ్చి తన పని కానిస్తుంది. అక్కడ ఉన్న బంగారం, డబ్బుతో ఉడాయిస్తుంది. ఇలా ఆరు పెళ్లిళ్లు చేసుకుంది. ఇందులో నాలుగవ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ క్రమంలో ఈ కిలాడీ మహిళ ఇటీవల మార్చి 26న బుద్వా ప్రాంతానికి చెందిన ఓ యువకుడిని 7వ వివాహం చేసుకుంది. పోలీసులకు సమాచారం రావడంతో కిలాడీ మహిళను, ఆమె ముఠా సభ్యుల ఆట కట్టించారు. అందరిపై పలు సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.