ఆడుకోవడానికి వచ్చిన బాలుడిపై వృద్ధుడు..?

by Vinod kumar |
ఆడుకోవడానికి వచ్చిన బాలుడిపై వృద్ధుడు..?
X

దిశ, మిర్యాలగూడ: ఆరేండ్ల బాలుడిపై ఓ 60 ఏండ్ల వృద్ధుడు లైంగిక దాడి చేసిన ఘటన మంగళవారం మిర్యాలగూడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. రూరల్ ఎస్సై నర్సింహా గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఆడుకునేందుకు ఇంట్లోకి వచ్చిన బాలుడి పై రాములు లైంగికంగా దాడి చేశాడు. బాలుడు ఏడుస్తూ.. జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాలుడి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు, బాలుడి ని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించి, అత్యాచారానికి పాల్పడిన రాములుని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Next Story